మరో సినిమాతో రాజ్‌తరుణ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో డీలాపడ్డ రాజ్‌తరుణ్ ఇటీవల ‘లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం కూడా ఆయనను కాపాడలేకపోయింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం రాజ్‌తరుణ్ గత చిత్రాల సరసన నిలిచింది. ఇక ఈ చిత్రం తరువాత రాజ్ తరుణ్ కొంత విరామం తీసుకొని కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు. ‘బాబు బాగా బిజీ’ చిత్ర డైరెక్టర్ నవీన్ మేడారం చెప్పిన కథకు ఓకే చెప్పి ఆయన దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ యువ హీరో. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుందని సమాచారం. అతి త్వరలోనే ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.