యథార్థ ఘటనలతో ఆపరేషన్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శషా చెట్రి (ఎయిర్‌టెల్ మోడల్), ఆది సాయికుమార్, కార్తీక్‌రాజు, పార్వతీశం, నిత్యానరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా, రావురమేష్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన కల్పిత కథాంశంతో.. ‘వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత’ వంటి సెన్సిబుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్‌రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. ఓ సినిమాలో పనిచేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఓ సినిమా నిర్మాణంలో భాగమవడం ఇదే తొలిసారి. అలాగే ఎయిల్‌టెల్ 4జి గర్ల్‌గా పాపులర్ అయిన శషాచెట్రి ఈ సినిమాతో తెలుగులో పరిచయమవుతున్నారు. ‘బొమ్మరిల్లు, కిక్, ఎవడు, మిస్టర్ పర్ఫెక్ట్, గూఢచారి’ లాంటి చిత్రాలకు రచయితగా పనిచేసి, కమల్‌హాసన్, మరియు తమిళ శంకర్‌తో కూడా పనిచేసిన స్టార్ రైటర్ అబ్బూరి రవిగారు ఈ చిత్రానికి రచయితగానే కాకుండా, మొట్టమొదటిసారిగా పవర్‌ఫుల్ విలన్ పాత్రని ఈ చిత్రంలో పోషిస్తున్నారు. అతడు సినిమాలో యంగ్ మహేష్‌బాబుగా, చత్రపతి సినిమాలో యంగ్ ప్రభాస్‌గాను, తనదైన గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌నందం ఈ సినిమాలో ఒక స్టైలిష్ విలన్‌గా కనపడతాడు. ఇంకా, పోకిరి, హ్యాపీడేస్ లాంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి, వినాయకుడుతో హీరోగా అలరించిన క్రిష్ణుడు ఈ చిత్రంలో ఒక విచిత్రమైన కామెడీ పాత్రని పోషిస్తున్నారు. ప్రముఖ పాటల రచయిత రామజోగయ్యశాస్ర్తీ ఈ సినిమాకు సాహిత్యాన్ని అందిస్తున్నారు. ‘సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, ఎ.ఓ.బి, చింతపల్లి, అరకు, కాకినాడ పోర్ట్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో సినిమా షూటింగ్ చేశాం. ఓ షెడ్యూల్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. జ్ఞానశేఖర్‌గారి దగ్గర సెకెండ్ యూనిట్ కెమెరామెన్‌గా వేదం, కృష్ణవందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలకి పనిచేసిన జైపాల్‌రెడ్డి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. క్షణం, పిఎస్‌వి గరుడవేగ, గూఢచారి సినిమాలకి స్వరాలు సమకూర్చి మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఓ డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తామని నమ్మకంగా చెబుతున్నాం.