రెయిన్‌చెక్ అంటే అదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టోన్ మీడియా ఫిల్మ్ బ్యానర్‌లో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ప్రేమకు రెయిన్‌చెక్’. ఈ చిత్రానికి ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఈనెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అభిలాష్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
* నా పేరు అభిలాష్ వాడ్డా. మా సొంతవూరు సాలూర్ విజయనగరం దగ్గర. ఇది నా తొలి చిత్రం. నేను ముందు ముంబైలో యాక్టింగ్ స్కూల్‌లో యాక్టింగ్‌లో శిక్షణ పొందాను. నేను చదువుకున్నది యుకెలో. నాకు యాక్టర్ అవ్వాలని ఎప్పటినుంచో ఉండేది. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవర్ని కలవాలి అన్న విషయం మాత్రం నాకు తెలియదు. నా చదువు పూర్తయ్యాక యాక్టింగ్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది నేర్చుకోవాలని ఉండేది. దానికోసం వెతుకుతుండగా లక్కీగా ఒకరోజు ‘పిల్లానువ్వులేని జీవితం’ ఆడియో ఫంక్షన్ చూస్తున్నప్పుడు పవన్‌కళ్యాణ్‌గారు ఈ ఇనిస్టిట్యూట్ గురించి సాయిధరమ్ తేజ్‌కి చెప్పారు. బ్యారిజాన్ అనే యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ బాగా నేర్పిస్తారని, ఆ విధంగా నాకు తెలిసింది. దాని తర్వాత సంక్రాంతికి ఇంటికి వచ్చాను. హైదరాబాద్‌లో ఆడిషన్స్ జరుగుతున్నాయి అని తెలియగానే ఆడిషన్స్‌కి వచ్చాను.
* ప్రేమకు రెయిన్‌చెక్ అంటే ఏదో మేము డిఫరెంట్‌గా ఉండాలి కొత్తగా ఉండాలని ఏమీపెట్టలేదు. సినిమా చూస్తే మీకు అర్ధమవుతుంది. రెయిన్‌చెక్ అంటే భవిష్యత్తులో పూర్తయ్యే ప్రమాణం. ఈ చిత్రంలో రమ్య అనే క్యారెక్టర్ చేసే ప్రియా తనకు రెయిన్‌చెక్ ఇచ్చే అలవాటు ఉంటుంది. అంటే ఎవరైనా ఒకరికి హెల్ప్‌చేస్తే మనం దానికి ప్రతిఫలం ఏదైనా చెయ్యాలనుకుంటాం కదా. కానీ ఆ అమ్మాయి ప్రస్తుతం నాకు ఏమీ చెయ్యొద్దు. భవిష్యత్తులో ఏదైనా కావల్సివస్తే తప్పకుండా అడుగుతాను అంటుంది. రెయిన్‌చెక్ అంటే అదే.
* ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు విక్కీ. నేను చాలా సిన్సియర్ అన్నట్లు అందరికీ హీరోయిన్ రెయిన్‌చెక్ ఇస్తే నేను ఈ అమ్మాయికి రెయిన్ చెక్ ఇస్తా అన్నట్లు. నాకు జీవితంలో ఒక ఫిలాసఫీ ఉంటుంది. నేను ఆఫీస్‌లో ఉండగా లవ్, రొమాన్స్ లాంటివి పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే దానివల్ల కెరీర్ డిస్టర్బ్ అవుతుంది అన్నది నా ఫిలాసఫీ. నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాక ఆ అమ్మాయితో పరిచయం అవుతుంది. నేను ఆ అమ్మాయికి రెయిన్‌చెక్ ఇస్తా. నాకు ప్రేమ ఉంది కానీ భవిష్యత్తులో నేను నిన్ను ప్రేమించవచ్చు. లేక వేరే అమ్మాయిని ప్రేమించవచ్చు అని అందుకే ప్రేమకు రెయిన్‌చెక్.
* ఈ సినిమాలో నేను ఎడ్వంచర్స్ స్పోర్ట్స్ కంపెనీకి వైస్ ప్రెసిడెండ్. నేను ముందు సిమ్లాలో ఉంటాను. కానీ కంపెనీ సరిగా రన్‌కాదు. బాగా లాస్‌లో ఉండడంవల్ల నేను హైదరాబాద్ వస్తాను. వచ్చి నేను కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అవుతాను. నా క్యారెక్టర్ విక్కీ. నేను చాలా కష్టపడతాను.
* ఈ సినిమాలో అదృష్టం ఏంటంటే మా దర్శకుడే నిర్మాత. ప్రేమకు రెయిన్‌చెక్ అన్నది ఆయన విజన్. ఆయన ఎలాగైతే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు అదే విధంగా తీశారు. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. గతంలోకూడా చెప్పాను. నా క్యారెక్టర్ ఎడ్వెంచర్స్‌స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి దానికి సంబంధించి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్‌కోసం ఆయన డెహ్రాడూన్ తీసుకువెళ్ళారు. డెహ్రాడూన్‌లో రెండువారాల షెడ్యూల్ అది మూడు, నాలుగు లొకేషన్స్‌లో తీశారు. కొత్త మొహాలందరితో కలిసి సినిమా తీయడమంటే గ్రేట్. అటువంటిది ఆయన యూనిట్ మొత్తం 60 మెంబర్స్‌ని డెహ్రాడూన్ తీసుకువెళ్ళి, ఒక మూవీకి షెడ్యూల్ చెయ్యడం అన్నది గ్రేట్. ఆయనే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ కాకపోయుంటే ఈ పాటను ఇక్కడ కెబిఆర్ పార్క్‌లో తీసేసేవారు.
* శరత్‌మరార్‌గారు జెపిగారికి మొదటినుంచే పరిచయం ఉంది. వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. కథ విని మూవీ చూసిన తర్వాత శరత్‌మరార్‌గారికి బాగా నచ్చింది. ఆయన ప్రెజెంట్ చెయ్యడానికి ముందుకువచ్చారు. ఇంత కొత్త వాళ్ళతో తీస్తున్నా అంత పెద్ద ప్రొడక్షన్‌హౌస్ ముందుకురావడం అంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మేం పడుతున్న కష్టాన్ని గుర్తించారనిపించింది. వెరీనైస్ ఆఫ్ షేర్ మరార్ సార్.
* ప్రేమకు రెయిన్‌చెక్ కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్‌టెయినర్. అంటే మా డైరెక్టర్‌గారు సినిమా తియ్యాలనుకున్నప్పుడు 150 రూపాయలు పేచేసి ఒక సినిమా చూసే ప్రేక్షకుడికి ఎలాంటి ఆహ్లాదాన్ని అందించాలో అటువంటిదే ఆయన చేసిన సినిమా. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆర్టిస్టుల నటన అన్నీ బావుంటాయి. డెఫినెట్‌గా డిజప్పాయింట్ మాత్రం చెయ్యవు. ఈ చిత్రంలోని నటీనటులు కూడా ఎవ్వరూ కొత్తగా అనిపించరు.
* ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్ మూడు. మొత్తం ఎనిమిది క్యారెక్టర్లు. హీరో సుమన్‌గారు, రఘుగారు బిగ్‌బాస్ షోలో గిరీష్‌గారు వీళ్ళందరూ చేశారు.
* మా డైరెక్టర్‌గారు, మా సినిమాటోగ్రాఫర్ ఆయన 90 చిత్రాలు చేశారు కానీ ఆయన మమ్మల్ని ఎప్పుడూ సెట్‌లో అరవడం కానీ, తిట్టడం కానీ ఇటువంటివి ఏమీలేవు. సో ప్రొడక్షన్ పరంగా స్టోన్ మీడియా మమ్మల్ని చాలాబాగా చూసుకున్నారు. ఒక యాక్టర్‌గా చాలా నేర్చుకున్నాను కూడా. సినిమా తియ్యడం చాలా ఈజీ కానీ జనాల్లోకి తీసుకెళ్ళడం మార్కెటింగ్ ఇలాంటి విషయాలు చాలా తెలిసొచ్చాయి.
* నాకు ఇష్టమైన హీరోలు.. అంటే అలా ఏమీలేదు. అందరూ ఇష్టమే. రామ్‌చరణ్, విజయ్‌దేవరకొండ, అందరూ చిన్నప్పటినుండి మహేష్‌బాబు సినిమాలు ఎక్కువగా చూసి పెరిగాను. హీరోలంతా నాకు ఇన్స్‌పిరేషన్.
* మా ఫ్యామిలీ గురించి...అమ్మ హౌస్‌వైఫ్, నాన్న, అన్నయ్య జాబ్‌చేస్తారు. వాళ్ళందరూ సాలూరులోనే ఉంటారు.
* ప్లానింగ్ అంటూ నాకు ఏమీలేదు. ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతుంది. మనతోపాటు ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. మన చేతిలో ఏమీ ఉండదు. కష్టపడితేనే ఫలితం.