నిరూపిస్తే..ఆస్తంతా రాసిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మరో వివాదం నెలకొంది. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ‘మా’ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. వీటిపై స్పందించిన ‘మా’ కార్యవర్గం సోమవారం సమావేశమైంది. ఆరోపణలపై తీవ్రంగా చర్చించింది. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ హాజరయ్యారు. సమావేశం అనంతరం సభ్యులు మీడియాతో మాట్లాడారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ.. మా అసోసియేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజంలేదని, ఆ డబ్బులతో ఇంతవరకు టీ కూడా తాగలేదని, తను ఫోన్ కూడా సొంతదే వాడుతున్నానని తెలిపారు. అసోసియేషన్‌లో ఐదు పైసలు దుర్వినియోగమైనా తన ఆస్తినంతా రాసిచ్చేస్తానని ఆయన శివాజీరాజా సవాల్ విసిరారు. నా పిల్లలమీద ఒట్టు.. నేను తప్పుచేశానని, ‘మా’ నిధులు మింగానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ఎన్నికల కోసం కొంతమంది ఎదురుచూస్తున్నారని, వాళ్లు తాము చేసే ప్రతి పనిని తప్పుబట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకామే డబ్బు వసూలైందని.. నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పేర్కొన్నారు. వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో ‘మా’ అసోసియేషన్ నిర్మించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అసోసియేషన్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఉద్దేశపూర్వకంగానే తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని శివాజీరాజా అన్నారు. అలాగే
‘మా’లో సభ్యులమధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. మా అసోసియేషన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా నూతన బిల్డింగ్ కట్టబోతున్నామని, దీనికోసం మెగాస్టార్ చిరంజీవిని కలిసామని ఆయన రెండు కోట్ల డొనేషన్ ఇస్తానని, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారని తెలిపారు. ఫండ్స్‌కోసం అమెరికాలో ప్రోగ్రాం చేసామని, చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చారని, తరువాత స్టార్ హీరోలు మహేష్‌బాబు, ప్రభాస్ వస్తారని తెలిపారు. సైరా చిత్రం షూటింగ్ వల్ల ఒక్క ప్రోగ్రాంకే చిరంజీవిగారు వచ్చారని, దీంతో కోటి రూపాయలు వచ్చాయన్నారు. అగ్రిమెంట్ ప్రకారం కోటి రూపాయలే ఇస్తామన్నారని, ఈవెంట్ మేనేజర్లకు ఎక్కువ వస్తే తామేం చేస్తామని శ్రీకాంత్ ప్రశ్నించారు. చిరంజీవి అమెరికాలో ఈవెంట్స్‌కు రారని ప్రచారం చేశారని, ఆయన స్టామినాను ఎవరు తక్కువ చేయలేరని అన్నారు. ‘మా’ అసోసియేషన్ అకౌంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయని, తన మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం ‘మా’ అసోసియేషన్‌లో రూ.5కోట్ల వరకు డబ్బులు ఉన్నాయని కోశాధికారి పరూచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. నిధులు దుర్వినియోగం అయ్యాయన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని ఆయన పేర్కొన్నారు.
చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో శివాజీరాజా,
పరుచూరి వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, హేమ తదితరులు