మా బ్యానర్‌లో హ్యాట్రిక్ అవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల ముఖ్యపాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఈనెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు భరత్‌చౌదరి, కిరణ్ రెడ్డి వివరాలు తెలియజేస్తూ.. పూర్తిస్థాయి కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. తమిళంలో సూపర్‌హిట్ సినిమా వెలట్టి వెందోత్తో వాలాకర్‌కు రీమేక్. కథపై చాలా నమ్మకంతో ఈ సినిమాను నిర్మించాం. ఈ సినిమాను తెలుగు నేటివిటీలోకి మార్చడం జరిగింది. ఈ సినిమాలో సిల్లీ ఫెలోస్ అంటే ఒక్కరో ఇద్దరో కాదు, దాదాపు అన్ని పాత్రలు సిల్లీగానే ప్రవర్తిస్తుంటాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో నరేష్ అద్భుతంగా నటించాడు. సునీల్ ఈ సినిమాతో మళ్లీ కమెడియన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నపుడు సునీల్‌ని అనుకోలేదు. కానీ ఈ పాత్రను ఆయన చేస్తేనే బాగుంటుందని అడిగాం. తాను వెంటనే ఒప్పుకున్నాడు. నిజంగా సునీల్‌కి ఇది కమింగ్ బ్యాక్ అవుతుంది. సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతుల్లో లేదు. ఖచ్చితంగా నరేష్‌కి ఈ సినిమా మంచి హిట్‌ని ఇస్తుంది. అలాగే భీమనేని శ్రీనివాస్ దర్శకుడిగా ఒకప్పుడు భారీ విజయాలను అందుకున్నాడు. పైగా రీమేక్ సినిమాలను డీల్ చేయడంలో ఆయనకు ప్రత్యేకత వుంది. ఇందులో రెండు పాటలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి హిట్‌గా నిలిచాయి. అలాగే ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ అయిపోయింది అన్నారు.