త్వరలో ఆటాడుకుందాం.. రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్ కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జిఫిలిమ్స్ పతాకాలపై నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందించిన చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’ (జస్ట్ ఛిల్). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ.. శ్రీ్ధర్ మంచి కథ ఇవ్వడంతో ఈ చిత్రంలో తన పాత్ర సరికొత్తగా రూపొందిందని, దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారని, అవి ప్రేక్షకులను బాగా నవ్విస్తాయని తెలిపారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు అందరికీ నచ్చుతాయని, సుశాంత్‌కి వందశాతం యాప్ట్ అయ్యే కథాకథనాలతో ఈ సినిమా రూపొందించామని, కామెడీ సన్నివేశాలకోసమే 60 లక్షల ఖర్చుతో టైమ్ మెషిన్ సెట్‌వేసి షూట్ చేసినవన్నీ కడుపుబ్బ నవ్విస్తాయని దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. సోనమ్‌ప్రీత్ బజ్వా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని, వెనె్నలకిషోర్, రఘుబాబు, పృథ్వి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: గౌతంరాజు, కథ, మాటలు: శ్రీ్ధర్ సీపాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.