సక్సెస్‌ఫుల్ పేపర్‌బాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్, రియా సుమన్ మరియు తాన్య హూప్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం పేపర్‌బాయ్. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ- మా సినిమా ప్రీ లుక్ నుండి ఇప్పటివరకూ అందరూ సపోర్టు చేస్తూ వచ్చారు. సంపత్ నన్ను, సంతోశ్, రియా, మహేశ్ విట్టా సహా కొత్తవాళ్లను ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన స్ట్రాంగ్ పిల్లర్‌లా నిలబడి మా సినిమాను నడిపించారు. సంపత్ కథ, మాటలను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు అన్నారు. హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ- పేపర్‌బాయ్‌ని సూపర్‌హిట్ చేసినందుకు థాంక్స్. సంపత్‌కి, జయశంకర్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. హీరో సంతోశ్ శోభన్ మాట్లాడుతూ- కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చిన సంపత్‌కి థాంక్స్. జయశంకర్ చక్కగా తెరకెక్కించినందుకు థాంక్స్ అన్నారు. సంపత్‌నంది మాట్లాడుతూ- ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పేపర్‌బాయ్ దినోత్సవం కాబట్టి పేపర్స్‌బాయ్స్ అందరికీ థాంక్స్. చాలామంది ఫోన్ చేసి మంచి ప్రయత్నం చేశానని అభినందిస్తున్నారు. మా సినిమాలో స్టార్స్ ఎవరూ లేరు. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్‌కి థాంక్స్ చెబుతున్నాను. ఇండస్ట్రీ నాకు అవకాశం ఇచ్చింది. నేను ఇండస్ట్రీలో మరొకరికి అవకాశం ఇస్తేనే ఇండస్ట్రీ మరో అవకాశం ఇస్తుందని భావించే ప్రొడక్షన్ చేశాను. ఈ ప్రొడక్షన్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఈ సక్సెస్ క్రెడిట్ మా టీమ్‌కే ఇస్తున్నాను అన్నారు.