సమంత స్పెషల్ సాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత ప్రధానపాత్రలో పవన్‌కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం యు టర్న్. ఈ చిత్రం విడుదలకు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా విడుదల హక్కులు మంచి రేట్లకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో ఒక స్పెషల్ సాంగ్ చేయించారు. ‘కర్మ థీమ్’ అంటూ వచ్చిన ఈ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఈ సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెంచడంలో సమంత విజయం సాధించింది. ఈ సినిమా విడుదలకోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 13న విడుదల కానుంది.