విలన్ పాత్రలకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మానందం తనయుడిగా తెలుగు తెరకు హీరోగా పరిచయమైన గౌతమ్ మొదటినుండి భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈమధ్య వరుస పరాజయాలతో ఆయన కెరీర్ వెనకపడిపోయింది.. దాంతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకోవాలనే కసితో ఉన్న గౌతమ్, రాజాగౌతమ్‌గా పేరు మార్చుకుని మరో భిన్నమైన ప్రయత్నంలో భాగంగా మను అనే సినిమాలో నటిస్తున్నాడు. చాందిని చౌదరి హీరోయిన్. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా క్రౌడ్ ఫండింగ్‌తో తెరకెక్కింది. ఫణీంద్ర దర్శకత్వంలో నిర్వాణ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజాగౌతమ్ చెప్పిన విశేషాలు..
* దర్శకుడు ఫణి చేసిన షార్ట్ఫిలిమ్ చూసి నార్మల్‌గా కలిశాను ఒకసారి. అపుడు తన దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పుకొచ్చాడు. అప్పుడు చెప్పిన స్టరీనే ఈ మను.. ఫణి స్టోరీ చెప్తున్నప్పుడు కూడా ఈ సినిమా నేను చేస్తానని నేననుకోలేదు. ఫణి కూడా అప్పటివరకు ఈ సినిమా చేయాలనే ఆలోచనలో లేడు. ఈ స్టోరీపై మూడున్నరేళ్ళు పనిచేశాం. ఇలాంటి సినిమా చేయాలంటే డబ్బులకన్నా ఎక్కువ టైమ్ ఇనె్వస్ట్ చేయాలి. అందుకే కథలో ప్రతి పాయింట్‌ని ఎస్టాబ్లిష్ అయ్యేలా చేశాం.
* నాకు వచ్చిన గ్యాప్‌లో చాలా కథలు విన్నా అద్భుతం అనిపించిన కథలు కూడా వదులుకున్నా. మనసులో ఒకటే తపన ది బెస్ట్ సినిమా చేయాలి. దానికోసం ఇన్నాళ్ళుగా వెదుక్కుంటే ‘మను’ దొరికింది. ఈ సినిమాకోసం ఇంతలా కష్టపడుతున్నా ఏమాత్రం కష్టమనిపించలేదు. ఏమైనా మంచి సినిమా చేద్దామని థియేటర్‌కి వచ్చిన ఆడియెన్స్‌ని 100% ఎంటర్‌టైన్ చేయాలి. వాళ్ళను డిజప్పాయింట్ చేయకూడదు అనే ఒక ఆలోచన ఉండేది.
* ఈ సినిమాకోసం చాలా మంది నిర్మాతలను కలిసాం... కథ బాగుందన్నారు కానీ నిర్మించేందుకు ఎవరు ముందుకు రాలేదు. దాంతో ఫణి, క్రౌడ్ ఫండింగ్ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. అంతే... 4 రోజుల్లో కోటి రూపాయలు వచ్చాయి. ఏ సినిమా చేసినా యాక్టర్‌గా నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి అదొక్కటే ఆలోచన. నాకు పర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ దొరకాలి. కానీ ఎలాంటి సినిమా అయినా చేసేస్తా. హీరోగానే చేయాలి అని అనుకోవట్లేదు.
* నెక్స్ట్ సినిమా అంటే... ప్రస్తుతానికి 2 నచ్చిన కథలున్నాయి కానీ ‘మను’ రెస్పాన్స్ తరవాత నిర్ణయం తీసుకుంటా.