బ్రహ్మానందంకు గురుశ్రీ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో సూపర్‌స్టార్‌గా మారిన కమెడియన్ ఎవరంటే అందరూ చెప్పే పేరు.. బ్రహ్మానందం. ఇప్పటికే వెయ్యికిపైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించి గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించుకున్న ఆయనకు శ్రీ కళాసుధ అసోసియేషన్ ‘గురుశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయనకు బంగారు కంకణాన్ని తొడిగారు. గత 20 ఏళ్లుగా శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కృష్టాష్టమి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ గాయని పి.సుశీల, సుజయ్ కృష్ణ, రంగారావు, శ్రీమతి విజయ రాజాం, బెల్లంకొండ కృష్ణమూర్తి, శ్రీకళాసుధ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సన్మానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. నిజంగా ఈ కృష్ణాష్టమి రోజున గురుశ్రీ పురస్కారంతో నన్ను అభినందించడం ఆనందంగాంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులను నవ్వించేందుకే దేవుడు నన్ను పంపించాడు. అందుకే మిమ్మల్ని నవ్విస్తున్నాను. మీ ఆదరాభిమానాలు ఉన్నంతవరకు మిమ్మల్ని నవ్వించే పనిలో ఉంటాను. శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం, ఇలా ప్రముఖులను అభినందించడం గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఇన్నాళ్లుగా పట్టువిడవకుండా చేస్తున్న ఒకే ఒక్కడు బేతిరెడ్డి శ్రీనివాస్ కృష్ణాష్టమి సందర్భంగా నాకు గురుశ్రీ గౌరవాన్ని ఇవ్వడం భగవత్ సంకల్పంగా భావిస్తున్నాను అన్నారు.