వాళ్లు ఆశించిందే ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య వరుస పరాజయాలతో కెరీర్ పరంగా బాగా వెనుకబడిపోయాడు అల్లరి నరేష్. టాలీవుడ్‌లో కామెడీ హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న నరేష్‌కు ఈ పరాజయాలు టెన్షన్ పెట్టాయి. దాంతో ఆయన కాస్త బ్రేక్ ఇచ్చి సునీల్‌తో కలిసి కామెడీ చేసేందుకు ‘సిల్లీ ఫెలోస్’గా వస్తున్నారు. భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ సినిమాస్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరో అల్లరి నరేష్‌తో ఇంటర్వ్యూ..
* మళ్లీ గ్యాప్ తరువాత సునీల్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా ఉంది?
- నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను, సునీల్ ఇదివరకే తొట్టిగ్యాంగ్ అనే సినిమా చేశాం. ఆ తరువాత రెండు మూడు సినిమాల్లో కలిసి నటించాం.. అయితే తొట్టిగ్యాంగ్ తరువాత ఫుల్ లెంగ్త్‌గా ఇద్దరం కలిసి నటిస్తున్న సినిమా ఇది.
* వరుస పరాజయాల తరువాత చేస్తున్న ఈ సినిమాపై
ఎలాంటి కేర్ తీసుకున్నారు?
- ఈమధ్య వరుస పరాజయాలు వచ్చిన మాట వాస్తవమే. అయితే నేను ఎలాంటి సినిమా చేయాలన్న టెన్షన్ పడ్డాను. ఎలాంటి ప్రయత్నం చేస్తున్నా ప్రేక్షకులు ఎందుకు రిసీవ్ చేసుకోవడం లేదు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేశా. నా సినిమాలనుండి ప్రేక్షకులు ఆశిస్తున్నది కామెడీ. దాన్ని కొత్తగా ఎలా ప్రెజెంట్ చేయాలి అన్న ఆలోచనతో నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇచ్చిన భీమనేని శ్రీనివాస్‌తో సిల్లీ ఫెలోస్ చేశాను.
* ఇది తమిళ రీమేక్ కదా, ఆ సినిమా చూసారా?
ఎలాంటి మార్పులు చేశారు?
- తమిళ మాతృక చూశాం. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశాం. ఈ సినిమా కథ బాగా నచ్చింది. పైగా తమిళంలో మంచి హిట్ అయిన సినిమా. తప్పకుండా నాకు మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది. నిజానికి భీమనేని, నా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి దీనికి సుడిగాడు 2 అన్న టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమాకు ఈ కథకు ఎక్కడ సంబంధం ఉండదు కాబట్టి వేరే టైటిల్ పెట్టాము.
* సునీల్‌తో మీ ర్యాపో ఎలా ఉంటుంది?
- నేను సునీల్ మంచి ఫ్రెండ్స్. ఆనందాలే కాదు బాధలూ పంచుకుంటాం. ఇద్దరికీ ఈమధ్య సరైన హిట్స్ రావడంలేదు కాబట్టి, ఎందుకు రావడంలేదన్న విషయంపై ఇక్కడే చాలాసార్లు మాట్లాడుకున్నాం. తనకు, నాకు మంచి కెమిస్ట్రీ కుదిరింది.
* దర్శకుడు భీమనేనితో..?
- దర్శకుడికి కథపై మంచి కమాండింగ్ ఉంది. పైగా కామెడీ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బస్టర్స్ హిట్స్ ఇచ్చిన ఆయన నాకు కెరీర్ బెస్ట్‌గా సుడిగాడు లాంటి సినిమా ఇచ్చాడు. మళ్లీ తనతో సుడిగాడు-2 చేయొచ్చు.
* మిగతా పాత్రలు..?
-ఇందులో హీరోయిన్‌గా చిత్ర శుక్ల నటించింది. తాను బాగా నటించింది. తప్పకుండా ఆ అమ్మాయికి మంచి పేరు వస్తుంది. అలాగే చాలామంది కమెడియన్స్ కనిపిస్తారు. అందరి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది.
* మహేష్ సినిమాలో నటిస్తున్నారు, మీ పాత్ర ఎలా ఉంటుంది?
- నిజంగా మహేష్ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్ర గురించి దర్శకుడు వంశీ అడిగాడు. నచ్చి వెంటనే ఓకె చెప్పా. పాత్ర ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే ఈ పాత్ర గురించి ఎక్కడా చెప్పొద్దని కండిషన్స్ పెట్టారు. ఖచ్చితంగా నాకు గాలి శీను తరహాలో పేరొస్తుంది.
* మీ బ్యానర్‌లో సినిమా ఎప్పుడు?
- మారుతి దర్శకత్వంలో ఓ నలభై మంది కమెడియన్స్‌తో పూర్తి కామెడీ సినిమా చేయాలని ఉంది.. చూద్దాం!
* మీ దర్శకత్వం ఎప్పుడు?
- విజన్ 2020 అని పెట్టుకున్నాను. నా దర్శకత్వంలో నేను నటించను, కొత్తవాళ్లతో కానె్సప్ట్ బేస్డ్ సినిమా చేస్తా.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాను. అది ఎనభై శాతం పూర్తయింది

- శ్రీ