జాతీయ వార్తలు

దిలీప్ కుమార్‌కు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 5: సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ వయోభారం సమస్యలతో బుధవారం ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఛాతి సంబంధమైన సమస్యలతో దిలీప్‌కుమార్ గత కొంత కాలంగా బాధపడుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ముంబాయి లీలావతిలో దిలీప్ కుమార్‌ను ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆయన భార్య సైరాభాను మాట్లాడుతూ గత కొంత కాలంగా దిలీప్ కుమార్‌కు ఇదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సను అందిస్తున్నట్లు చెప్పారు. వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఆమె చెప్పారు. కిడ్నీ సంబంధమైన సమస్యలతో ఆయన 2017 ఆగస్టులో ఇదే ఆసుపత్రిలో చేరారు. దిలీప్ కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1994లో, పద్మవిభూషణ్ అవార్డును 2015లో ప్రదానం చేశారు.