కర్త కర్మ క్రియ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మించనున్న చిత్రం టైటిల్ ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు. ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంత్‌సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. ‘మా సంస్థనుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్ని సినిమాలకంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురిచేసేలా ఉంటుంది. ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్‌ను ‘కెకెకె’ అని విడుదల చేసినప్పట్నుంచి టైటిల్ ఏంటో అనే అటెన్షన్ అందరిలో మొదలైంది. ‘కర్త కర్మ క్రియ’అనే వైవిధ్యమైన టైటిల్‌ను ఈ సినిమాకు ఎంచుకుని ఈరోజు రివీల్ చేస్తున్నాము. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే మోషన్ పోస్టర్, టీజర్‌లను విడుదల చేస్తామన్నారు. దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కథ ఇది. మనం రోజు చూసే, వినే కాంటెంపరరీ క్రైమ్‌కు సంబంధించిన ఎలిమెంట్‌తో ఈ ‘కర్త కర్మ క్రియ’ను రూపొందిస్తున్నాము. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. మంచి టెక్నికల్ టీమ్ మా సినిమాకు సెట్ కావటంతోపాటు, నిర్మాతల సపోర్ట్ మా సినిమాకు ప్రధాన బలం. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి ఈ సినిమాను కంప్లీట్ చేశాము. హీరోహీరోయిన్‌లు కొత్తవారైనా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్‌గా అంతే ఉత్తమంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తీశాము. కర్తకర్మక్రియ యాప్ట్ టైటిల్. టైటిల్‌లోనే ఈ సినిమా అసలైన కంటెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ టైటిల్, కంటెంట్ నచ్చుతుందని మాటీమ్ అందరికీ పేరొస్తుందన్న నమ్మకముందన్నారు. వసంత్ సమీర్, సెహర్, రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, కాదంబరి కిరణ్, నీలిమ, జయప్రకాష్, శ్రీసుధ, కాశీవిశ్వనాథ్, సంధ్య పెద్దాడ, రమణారెడ్డి, కృష్ణతేజ, మహేందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గాకిషోర్ బోయిదాపు, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్‌ప్రకాష్, కొరియోగ్రఫీ: అనీ, కాస్ట్యూమ్స్: టి.ఎస్.రావు, కాస్ట్యూమ్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాణ నిర్వహణ: వినాయకరావు, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన-దర్శకత్వం: నాగు గవర.