అశ్వమేథ యాగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔరోస్ అవతార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తున్న సినిమా ‘అశ్వమేథం’. ధృవ కరుణాకరన్, శివంగి, సోనియా కీలక పాత్రధారులు. నితిన్.జి దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్యా యాదవ్, ప్రియా నాయర్ నిర్మాతలు. చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గురువారం ప్రెస్‌మీట్‌ను నిర్వహించిన కార్యక్రమంలో గజానన అనే పాటను నిర్మాత ఐశ్వర్య యాదవ్ విడుదల చేశారు. చరణ్ అర్జున్ మాట్లాడుతూ- నా మ్యూజిక్ మార్కెట్‌లోకి రాక నాలుగేళ్లు అయింది. ప్రెష్ మ్యూజిక్‌తో వస్తున్నాను. అంతకుముందు నేను చిన్నిచరణ్‌గా చాలా సినిమాలు చేశాను. ఇపుడు చరణ్ అర్జున్ అని పేరు మార్చుకున్నాను. వినాయకుడి పాటతో నేను చరణ్ అర్జున్‌గా రీ లాంచ్ కావడం ఆనందంగా ఉంది అన్నారు. ఐశ్వర్యా యాదవ్ మాట్లాడుతూ- ఈ ప్రాజెక్టును అందరూ ఆదరిస్తారని నమ్మకం ఉంది అన్నారు. ప్రియ మాట్లాడుతూ- కష్టపడి తెరకెక్కించిన చిత్రం ఇది. చాలా మంచి టీమ్ కుదిరింది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- గజానన పాటను తెరమీద చూస్తున్నపుడు నాకు మేజికల్ మూమెంట్‌లాగా అనిపించింది. గణేశ్ మాస్టర్ ఈ సినిమాకు కొరియోగ్రఫీ చేశారు. తెలుగు ప్రజలు ప్రోడక్ట్ బావుంటే అప్రీషియేట్ చేస్తారు. మా సినిమాను కూడా అదే రీతిలో ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను అన్నారు. ధృవ మాట్లాడుతూ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఎమోషనల్ అటాచ్‌మెంట్ వున్న సినిమా ఇది. చరణ్ పాటలు, గణేష్ డాన్సులు సినిమాకు హైలెట్ అవుతాయి అని చెప్పారు. సుమన్, రామజోగయ్య శాస్ర్తీ, వెనె్నల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రధారులు.