మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరగు పరిచయం అయిన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన వరసగా అవకాశాలు అందుకున్న ఈమె తాజాగా నాగచైతన్య సరసన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మలయాళ భామ అను ఇమ్మాన్యుయేల్ చెప్పిన విశేషాలు..
పెద్ద ఇగోయిస్టుగా..
ఈ చిత్రంలో నేను పెద్ద ఇగోయిస్టుగా నటించాను. కానీ అందులో కామెడీ ఉంటుంది. ఫస్ట్‌టైం ఈ సినిమా ద్వారా ఎక్కువగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సినిమా విషయంలో నిజంగా సీనియర్ నటి రమ్యకృష్ణతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇందులో ఆమె కూతురిగా నటించాను. రమ్య మేడమ్ చాలా బ్రిలియంట్. ఒక్కసారి స్క్రిప్ట్ చూసుకొని ఎంత పెద్ద డైలాగ్‌నైనా అవలోకగా చెప్పేస్తుంది.
వరుస పరాజయాలు..
ఎవరైనా సినిమా హిట్ అవ్వాలనే చేస్తారు. నిజానికి ‘అజ్ఞాతవాసి’ కథను త్రివిక్రమ్‌గారు చెప్పారు. నా పాత్ర గురించి వివరించిన తరువాతే ఆ సినిమా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ప్రణీత పాత్ర గొప్పగా ఉండదు.. కానీ ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఇది కూడా అలాగే ఉంటే నేను చేయకపోయేదాన్ని. ఆ సినిమాలో చేయడానికి మరొక కారణం పవన్‌కళ్యాణ్‌గారు. ఆయనతో నటించే అవకాశం వచ్చింది. ‘నా పేరు సూర్య’ కూడా కథ విన్నాకే ఒప్పుకున్నాను. ఇక లేటెస్టుగా ‘గీతగోవిందం’ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సమయంలో అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చేస్తున్నాను. అందుకే చేయడం కుదరలేదు. ఇపుడు ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. నిజంగా ఆ సినిమా మిస్ అయినందుకు కొంచెం ఫీల్ అవుతున్నా.
చైతుతో..
నాగచైతన్యతో సినిమా చేయడం చాలా హ్యాపీ. తాను చాలా కూల్‌గా ఉంటాడు. అలాగే దర్శకుడు మారుతీ కూడా. ఆయనకు ఈ కథపై చాలా కమిట్‌మెంట్ ఉంది. ఈ సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు. నేను ‘అజ్ఞాతవాసి’ సినిమాకు మాత్రమే డబ్బింగ్ చెప్పాను. తెలుగు అర్థం అవుతుంది.. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.
తదుపరి చిత్రాలు..
ఇప్పటివరకూ ఏ సినిమాకు ఓకె చెప్పలేదు. ‘శైలజారెడ్డి అల్లుడు’ విడుదలైన తరువాత డిసైడ్ అవుతాను. అలాగే తమిళ, మలయాళ భాషల్లో కూడా చేయాలని ఉంది. మలయాళం స్క్రీన్ షేర్ తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు నివిన్ పౌలీతో ఒక సినిమాలో నటించాను. ఆ సినిమాలో కూడా స్క్రీన్ షేర్ తక్కువగానే ఉంటుంది. అందుకే మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను.

- శ్రీ