అర్జున్ కురుక్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ సినిమా కురుక్షేత్రం. వినాయకచవితి సందర్భంగా విడుదలకు సిద్ధం అయ్యింది. తమిళంలో ‘నిబునన్’ పేరుతో విడుదలై మంచి పేరుతోపాటు కమర్షియల్‌గా కూడా మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రాన్ని అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ఫ్యాషన్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ మీసాల తెలుగులో ఈ వినాయక చవితి సందర్భంగా ఈనెల 13న భారీగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తమిళ నిర్మాత ఉమోష్ మాట్లాడుతూ.. ఫ్యాషన్ స్టూడియో నుండి మేం నిర్మించిన రెండో చిత్రం ఈ కురుక్షేత్రం. తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులో అంతకంటే మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. వీటితోపాటు మరో రెండు ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. వాటిలో సిద్ధార్థ హీరోగా ఒక ప్రాజెక్ట్ ఉంది. తెలుగు ప్రేక్షకులు మా మొదటి సినిమా ‘పాండవులలో ఒకడు’ను మంచిగా ఆదరించారు. కురుక్షేత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది’ అన్నారు. దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ.. ‘కురుక్షేత్రం తెలుగులో మంచి రిలీజ్‌ని ప్లాన్ చేస్తున్న టైంలో నిర్మాతలు సాయి, శ్రీనివాస్‌లు కలిసారు. తెలుగులో వారు చిన్న మార్పులను సూచించారు. తెలుగులో సినిమా ఇంకా గ్రిప్పింగ్ ఉండేలా చేసాం. క్రైం యాక్షన్‌ని ఇష్టపడే వారిని తప్పకుండా థ్రిల్ చేస్తుంది. నాకు తెలుగు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందుకని తెలుగు రిలీజ్ గురించి చాలా ఆసక్తిగా ఉన్నాను. తప్పకుండా సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది’ అన్నారు.