‘ది ఫాగ్’ ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త కథలతో కొత్త కథనాలతో తెలుగు సినిమా వెలిగిపోతుంది. ఘాజి, అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100, కేరాఫ్ కంచెరపాలెం ఇలా..ఎన్నో కొత్త చిత్రాలతో కొత్త కథనంతో కొత్త నటీనటులతో విడుదలై విజయవంతం అయ్యాయి. ఇప్పుడు మరో చిత్రం మరో కొత్త అంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మ్యాజిక్ లైట్స్ స్టూడియోస్, వర్షి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఎమ్.వి.రెడ్డి నిర్మాతగా కొత్త నటీనటులతో ‘ది ఫాగ్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధుసూదన్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎమ్‌విరెడ్డి నిర్మాతగా మధుసూదన్ దర్శకత్వంలో వస్తున్నసినిమా ‘ది ఫాగ్’. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు చూసాను. సినిమా చాలా కొత్తగా ఉంది. కొత్త కెమెరాతో ఎటువంటి లైట్స్ లేకుండా కొత్త లొకేషన్స్‌లో సున్న ఉష్ణోగ్రతలో హాలీవుడ్ స్టైల్‌లో తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. చిన్న సినిమా అంటున్నారు కానీ చాలా పెద్ద సినిమాగా కనిపిస్తోంది. ఈరోజుల్లో మనకి తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ సినిమా కావాలి. అలా తీస్తే సినిమాకి మంచి లాభం వస్తుంది అని నా అంచనా. ఈ సినిమా దర్శకుడు మధుసూదన్ కెరీర్‌కి మరియు తెలుగు సినిమాకి మంచి మలుపు అవుతుంది’ అని కోరుకున్నారు. విరాట్ చంద్ర, హరిణి, చందన, ఆత్మనంద, ప్రణీత, సతీష్‌రెడ్డి, ప్రమోద్, చందు, మహేష్‌రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: యల్లనూరు హరినాథ్, సతీష్‌రెడ్డి, సంగీతం: సందీప్, సహ నిర్మాత: గోవర్ధన్‌రెడ్డి, నిర్మాత: ఎం.వి.రెడ్డి, మధుసూదన్.