భక్తి మార్గంతో క్రీస్తు యేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి.ఎస్.ఆర్. ప్రధాన పాత్రధారిగా సంగాల దయానంద క్రియేషన్స్ పతాకంపై కుమార్‌రాజా దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘క్రీస్తు యేసు’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. క్రీస్తుయేసు బోధనలే ప్రపంచానికి భక్తిమార్గాన్ని చూపుతాయన్న ఓ సత్యంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, చారిత్రాత్మక సినిమాగా నిర్మించిన ఈ చిత్రంలో పెద్దవాళ్లను గౌరవించాలని, దేశం పట్ల గౌరవభావం పెంపొందించుకోవాలన్న క్రీస్తు బోధనలు ప్రధాన ఇతివృత్తంగా సాగుతాయని తెలిపారు. సినిమా చూసిన ప్రతి భక్తుడు ఆనందిస్తాడని, ఈ సినిమాలో పాటలన్నీ విజయవంతమవ్వాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తుయేసును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అందరికీ నచ్చే కథనంతో రూపొందిన క్రీస్తుయేసు తప్పక విజయం సాధిస్తాడన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. లక్ష్మి, శాంసన్, సంగాల కిరణ్‌కుమార్, జైరాజ్, చెరుకూరి సాంబశివరావు, చెర్రి, ప్రసాద్, సాయి, విజయ్, సుబ్రహ్మణ్యం, కత్రిన, దిప తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సంగాల, నిర్మాత: చండ్ర పార్వతమ్మ, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఆర్.కుమార్‌రాజా.