అనగనగా ఓ ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాత డి.వి.ఎస్.రాజు అల్లుడు కె.ఎల్.ఎన్.రాజు గత 30 సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్‌గా పేరుపొంది ఉన్నారు. చాలా రోజుల తర్వాత నిర్మాతగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్‌ను స్థాపించి అనగనగా ఓ ప్రేమకథ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ తన సామాజిక మాథ్యమం ట్విట్టర్‌లో ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు మాట్లాడుతూ- ఈ సినిమా ద్వారా నూతన హీరో హీరోయిన్‌లను పరిచయం చేస్తున్నాం. ప్రతాప్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. తొలి ప్రచార చిత్రాన్ని వరుణ్‌తేజ్ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు. ప్రతాప్ ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి హీరోగా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్‌ను పరిచయం చేస్తున్నారు. హీరోయిన్‌గా రిద్దికుమార్ మరియు రాధా బంగారు పరిచయం అవుతున్నారు. దర్శకుడు ప్రతాప్ మాట్లాతుతూ రాజు బ్యానర్‌ను స్థాపించి మొట్టమొదటి సినిమా నాకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు తదితరులు నటిస్తున్నారు.