హలో గురు ప్రేమకోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘హలో గురు ప్రేమకోసమే’. పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సిబుల్, క్యూట్ ప్రేమకథా చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా టాకీపార్ట్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను అక్టోబర్ 18న దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాత రాజు సన్నాహాలు చేస్తున్నారు. ప్రకాష్‌రాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫి, సాహి సురేశ్ ఆర్ట్‌వర్క్, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ అందిస్తున్నారు.