సర్కార్ కోసం సూపర్‌స్టార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కార్’. క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చెన్నైలోని క్రికెట్ స్టేడియంలో ఆడియో వేడుకను గ్రాండ్‌గా జరిపేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ ఆడియో వేడుకకోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారట. వచ్చే నెల 2న ఈ పాటల పండుగను జరపనున్నారని సమాచారం. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.