కేరాఫ్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘విజయ్ ప్రవీణ్ పరుచూరి నిర్మాత, సుబ్బారావు, రాధాబెస్సి, కేశవ, కార్తీక్ తదితరులు తారాగణంగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా.. మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు సంగీతం అందించడమే కాదు.. ఓ పాట కూడా పాడాను. విజయగారు సినిమాకు రైట్ ప్రొడ్యూసర్. రైట్‌టైమ్‌లో సురేశ్‌బాబుగారు సహకారం అందించారు. డైరెక్టర్ వెంకట్ సౌండ్ విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నారు కాబట్టి మంచి అవుట్‌పుట్ రాబట్టుకోగలిగాం’’ అన్నారు. చిత్ర దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ.. ‘యాక్టింగ్ అనేది డెడ్లీ స్పోర్ట్. చాలా ఎనర్జీ ఖర్చుఅవుతుంది. నేను కనీస సదుపాయాలు కూడా ఏర్పాటుచేయలేదు. షూటింగ్ మధ్య దాహం వేసినా.. ఇంటికి వెళ్లి నీళ్లుతాగి వచ్చేవాళ్లు. నటీనటులు చాలా కష్టపడ్డారు. అలాగే సాంకేతిక నిపుణులు ఎంతగానో సపోర్ట్ అందించారు. ఆదిత్య, వరుణ్‌లు ఎంతో బ్యూటిఫుల్ విజువల్స్ అందించారు. కంచరపాలెంను నేను ఎలా చూపించాలనుకున్నానో అలాగే కనపడుతుంది. ఎడిటర్ కచ్చితంగా తను జాతీయస్థాయిలో శ్రీకర్ ప్రసాద్‌లా గొప్ప ఎడిటర్ అవుతానని చెప్పగలను. నాగార్జున అద్భుతమైన సింక్ సౌండ్ అందించాడు. నేను స్వీకర్ కలిసి పెరిగాం. తను మణిశర్మగారి వద్ద పనిచేశాడు. ఫైనల్ కట్ తర్వాతే స్వీకర్ మ్యూజిక్ ఇచ్చాడు. తను ఓ పాటనుకూడా పాడాడు. సినిమాను క్రౌడ్ ఫండింగ్ చేద్దామని అనుకుంటున్న తరుణంలో.. విజయప్రవీణ పరుచూరిగారు... నేను డైరెక్ట్ చేసిన వీడియోచూసి సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆరోజునుండి నేటివరకు ఆమె నాకు అండగా నిలబడ్డారు. ఆమెనుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. సురేశ్‌బాబుగారు, రానాగారు ఓ ఎర్రబస్సు ప్రయాణాన్ని బిజినెస్‌క్లాస్ ప్రయాణంగా మార్చారు. సురేశ్‌బాబుగారు, రానాగారు బ్యాక్‌అప్ ఇచ్చి ఉండకపోతే.. ఈ రేంజ్‌లో ప్రేక్షకులకు సినిమా రీచ్ అయ్యేదికాదు. ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి నిజమేనా! అనే అనుభూతి కలుగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థాంక్స్’ అన్నారు. డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలంటే చిన్నచూపు ఉండటమే చెడు అలవాటుకు అలవాటుపడిపోయి ఉన్నాం. మంచి సినిమాలను తక్కువమంది చూస్తున్నారు. కాబట్టి ఫిలిం లవర్స్‌కు, సెలబ్రిటీస్‌కి సినిమా చూపించాం. అందరూ సినిమా చూసి.. చాలా బావుందని జనాల్లోకి సినిమాను తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. విజయప్రవీణ అమెరికానుండి.. వెంకటేశ్ మహా అనే కొత్త అబ్బాయితో ధైర్యంగా సినిమా చేసింది. ఫస్ట్‌టైమ్ డైరెక్టర్ అయిన మహా ప్రతి క్యారెక్టర్‌ను చక్కగా రాసి నేచురల్‌గా తెరకెక్కించారు. అందుకే సినిమా చూసిన అందరూ అభినందించారు. ఈ సినిమా ఇంకా సక్సెస్ కావాలి. చాలామందికి ఎంత మంచి సినిమానో తెలియాల్సిన అవసరం ఉంది’ అన్నారు.