డిసెంబర్‌లో యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్రను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్‌ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్‌తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్‌తో యాత్ర స్టోరీలోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందోబ్రహ్మ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. భలే మంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ హంగులతో యాత్ర చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బర్త్‌డే కానుకగా యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి మాట్లాడుతూ.. మడమతిప్పని నాయకుడి పాత్రలో నటిస్తున్న మమ్ముట్టిగారు... ప్రజానాయకుడు వైఎస్‌ఆర్ పాత్రలో పరకాయప్రవేశం చేసి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన యాత్ర మొదటి లుక్‌కి, టీజర్‌కి, ఫస్ట్ సింగిల్‌కు రెండు రాష్ట్రాల ప్రజలనుండి అనూహ్యమైన స్పందన రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్‌నుంచి భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దివంగత నేత వైఎస్ రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాటపటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.