ప్రేమకథలో మరో కోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజాన్ని తన కోణంలో చూసే అమ్మాయి కథగా వస్తున్న చిత్రం ‘మసక్కలి’. అర్జున్‌రెడ్డి సినిమాను ఒక అమ్మ కోణంలో చూస్తే ఎలా వుంటుందో అలా వుండే చిత్రమిది. స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే అబ్బాయి కథ ఇది అంటున్నాడు నూతన దర్శకుడు నబి ఏనుగుబాల. సాయి రోణక్, శ్రావ్య, శిరీషా వంక హీరో హీరోయిన్లుగా డు గుడ్ ఫాలో రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమిత్‌సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు నబి ఏనుగుబాల చెప్పిన విశేషాలు. మనం కొన్ని కథలను వింటాం. కొన్ని కథలనే నమ్ముతాం. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా వుంటాయి. అదే ఈ చిత్రం. అంతర్లీనంగా సందేశం వున్నా కూడా అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కించాం. అబ్బాయి ప్రేమ సిన్సియర్‌గా వుంటుంది. అబ్బాయి మాత్రమే ప్రేమిస్తాడు. అమ్మాయి ప్రేమించదు. కానీ ఆమె ప్రేమకోసం అతడు చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. ఇందులో హీరో సైకాలజీ విద్యార్థిగా ఓ డాక్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తాడు. హీరో హీరోయిన్లు సాయి రోణక్, శ్రావ్య, శిరీషాలు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా మహిరామ్స్ అందించిన పాటలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మా నిర్మాతకు సామాజిక బాధ్యత చాలా ఎక్కువ. అందుకనే మంచి సందేశాత్మక అంశాలతో సినిమా ఉండాలని చెప్పాడు. ఆయన కోరిక మేరకు అన్ని రకాల హంగులతో ఈ సినిమా సిద్ధం చేశాం. తక్కువ బడ్జెట్‌లోనే మంచి క్వాలిటీగా తెరకెక్కింది. సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే హైలెట్‌గా నిలుస్తుంది. ఇది నా మొదటి చిత్రం. మాది కర్నూలు. నేను జర్నలిస్టుగా టీవీ చానెల్‌లో పనిచేశాను. ఆ తరువాత కొన్ని సీరియల్స్‌కు కూడా పనిచేశాను. సినిమా చేయాలన్న ఆసక్తితో ఈ కథను సిద్ధం చేసుకున్నాను. దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు అన్నారు.