హీరోల మధ్య పోటీ తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం హీరోలమధ్య చాలా పోటీ వుంది. ఆ పోటీ ఆరోగ్యకరంగానే ఉంది. ఆ పోటీలో తట్టుకుని నిలబడేందుకు గట్టిగానే ప్రయత్నం చేయాలని అంటున్నాడు నాగచైతన్య. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగచైతన్యతో ఇంటర్వ్యూ...

ఎంటర్‌టైనింగ్‌గా..

నా పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయాలని చాలారోజులనుంచీ అనుకుంటున్నా. ఖచ్చితంగా అలాంటి పాత్రను మారుతి ఇచ్చాడు. ఈ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరవుతాను. ఇందులో నా పాత్రకు ఎలాంటి ఈగో ఉండదు. కూల్‌గా ఉంటాను. నా ప్రక్కనున్న వ్యక్తుల ఇగోలవల్ల ఏర్పడిన సమస్యలను ఎలా డీల్ చేశానన్నదే ఈ చిత్రం.
అత్త అల్లుడు మధ్య..
ఇదివరకు అత్త అల్లుడుమధ్య చాలా సినిమాలు వచ్చాయి. వీటిల్లో అత్తా అల్లుడు మధ్య పోటీ లేదా డామినేషన్ వుండే కథలే మనం చూశాం. కానీ ఇందులో అలా ఉండదు. మనిషికి ఇగో ఎక్కువైతే ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నది కామెడీగా ఉంటుంది. అలాగే చిన్న మెసేజ్ కూడా ఇచ్చాము.
రమ్యకృష్ణతో..
రమ్యకృష్ణతో పనిచేయడం అనగానే మొదట్లో కాస్త నెర్వస్‌గా అనిపించింది. తను సీనియర్ నటి. ఎలా డీల్ చేయాలి అని. కానీ షూటింగ్‌లో తను చాలా కూల్‌గా వుంటూ ఎంతో సపోర్టు అందించింది. రమ్యకృష్ణ, నాన్న కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ చూశాను. ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరిమధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి.
అర్జున్‌రెడ్డి లాంటి..
ఈమధ్య తెలుగులో చాలా భిన్నమైన సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 లాంటి సినిమాలు చూశాను. బాగా నచ్చాయి. అలాంటి పాత్రలు చేయడానికి ఇంకా కొంత టైమ్ పడుతుంది. ప్రస్తుతం అలాంటి కథలు నా దగ్గరకు రాలేదు.
హీరోల మధ్య పోటీ..
హీరోలమధ్య పోటీ అనేది ఎప్పటికీ వుంటుంది. అది ఆరోగ్యకరమైందే. ఒక హీరో సూపర్‌హిట్ కొడితే మనం కూడా మంచి హిట్ కొట్టాలన్న కసి కల్గుతుంది. ప్రస్తుతం నాతోటి హీరోలే కాదు సీనియర్ హీరోలు కూడా నాకు పోటీ అని భావిస్తాను. అందుకే సినిమా విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటా.
కొత్త దర్శకులతో..
కొత్త దర్శకులతో నేను ముందునుంచీ సినిమాలు చేస్తూనే ఉన్నాను. అయితే ఆమధ్య రెండు మూడు సినిమాలు సరిగా ఆడలేదు. అందుకే కొత్త దర్శకులంటే కాస్త ఆలోచించే అవకాశం ఏర్పడింది. తప్పకుండా మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త దర్శకులకు ప్రోత్సాహం ఉంటుంది.
మారుతితో..
మారుతితో పనిచేయడం చాలా ఎంజాయ్ చేశాను. తను కథ చెప్పినప్పటినుంచీ మా జర్నీ మొదలైంది. మారుతి సినిమాలని డీల్ చేసే విధానం కొత్తగా వుంటుంది. తప్పకుండా ఈ సినిమాతో అతనికి మంచి క్రేజ్ వస్తుంది.
సమంత బిజీ..
సమంత ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారింది. ఆమె బిజీ అయితే నాకూ ఆనందమే. తను నటించిన యు టర్న్ చిత్రం ఒకే రోజు విడుదలవ్వడం యాదృచ్ఛికమే అయినా రెండు సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం సవ్యసాచి చిత్రం ఒక్క పాట మిగిలి ఉంది. ఈనెల 15 నుంచి దాని చిత్రీకరణ మొదలుపెడుతున్నాం. దాంతోపాటు సమంతతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. అది ఈనెలలోనే మొదలవుతుంది. అలాగే వెంకీ మామ సినిమా కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది.

- శ్రీ