96 పైనే ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్ద కాలంపైగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తరువాత ఆమెకు మళ్లీ వరుస పరాజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకి భారీ పరాజయం పాలవ్వడం, ఈమధ్యే వచ్చిన మోహిని కూడా సరైన సక్సెస్‌నివ్వలేదు. అయినా సరే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీగా మారింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి జంటగా త్రిష నటిస్తున్న తాజా చిత్రం 96. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష నటన హైలెట్‌గా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తప్పకుండా త్రిషకు టర్నింగ్ ఇస్తుందని అంటున్నారు. మరి 96 సినిమాతో త్రిష జాతకం ఎలా మారనుందో చూడాలి!