1న నన్ను వదిలి నీవు పోలేవులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీప్ టోన్ స్టూడియోస్, శ్రీ కామాక్షి మల్టీ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బాలకృష్ణ కోలా, వామిక జంటగా గీతాంజలి శ్రీరాఘవ దర్శకత్వంలో కోలా భాస్కర్, కంచెర్ల పార్థసారధి రూపొందిస్తున్న చిత్రం ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ఐదు పాటలు విజయవంతమైనట్లే సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకముందన్నారు. శ్రీరాఘవ కథ, స్క్రీన్‌ప్లే సినిమాకు హైలెట్‌గా వుంటాయని, ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. కళ్యాణ్ నటరాజన్, శరణ్, పార్వతి నాయర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: అనంత్ శ్రీరామ్, ఎడిటింగ్: రూకేష్, మాటలు:వి.కృష్ణతేజ, సంగీతం: అమృత్, కెమెరా:శ్రీ్ధర్, నిర్మాతలు:కోలా భాస్కర్, కంచెర్ల పార్థసారధి, దర్శకత్వం: గీతాంజలి శ్రీరాఘవ.