భిన్నమైన పాత్రలు చేయాలనుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు హీరోగానే కాకుండా మొదటిసారి ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నూతన దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నభ నటేష్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానున్న సందర్భంగా నభనటేష్ చెప్పిన విశేషాలు..
‘‘ఇందులో నాది చాలా స్ట్రాంగ్ క్యారక్టర్. అందుకే చాలామంది హీరోయిన్లను ఆడిషన్ చేసి చివరికి నన్ను ఎంపిక చేశారట. సినిమాలో నన్ను చూశాక, జీవితంలోనూ ఇలాంటి అమ్మాయి ఉంటే బావుంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అంత బాగుంటుంది పాత్ర. హీరో సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్. అమెరికాకు వెళ్లాలని కలలు కంటుంటాడు. దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలోనే అతనికి ఓ అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె పరిచయం అతనిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అతను గోల్ సాధించగలిగాడా? లేదా? అనేది మిగతా సినిమా. నాది బెంగుళూరు... అక్కడ థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఆ తరువాత దేశ వ్యాప్తంగా పలు స్టేజీ షోలు ఇవ్వడం జరిగింది. కన్నడలో రెండు సినిమాలు చేశాను. తెలుగులో నిజానికి ఇది నా రెండో చిత్రం. మొదటి చిత్రం రవిబాబు దర్శకత్వంలో వస్తున్న అదుగో సినిమా. కానీ ఈ సినిమా ముందు విడుదలవుతోంది కాబట్టి ఇదే నా మొదటి చిత్రం. ఎప్పటినుండో తెలుగులో సినిమా చేయాలన్న ఆలోచన ఉండేది. కన్నడలో పృథ్వీరాజ్‌కుమార్ సరసన నటించాను. ఇక అదుగో సినిమాలో పంది పిల్లతో కలిసి నటించడం కొత్తగా అనిపించింది. నిజంగా పంది పిల్లతో సినిమా చేయాలని మొదట అడిగినప్పుడు షాక్ అయ్యా.. కానీ కథ విన్నాక చాలా నచ్చింది. ఇక సుధీర్‌బాబు లాంటి స్టార్‌తో పనిచేయడం లక్కీగా ఉంది. ఈ సినిమాతో తప్పకుండా తెలుగులో మంచి క్రేజ్ వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా తరువాత ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఈ సినిమా విడుదల అయితే తప్ప దాని గురించి ఆలోచించడం లేదు. నేను అని రకాల పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. రొటీన్‌గా కాకుండా కొత్తగా చేయాలన్నది నా కోరిక. ఇక గ్లామర్ రోల్స్‌కు నేను సిద్ధమే. ముఖ్యంగా థియేటర్ నేపథ్యం నుండి వచ్చాను కాబట్టి.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయాలని ఉంది.