పాటలు నేరుగా మార్కెట్‌లోకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.్థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ తన ట్విటర్ ద్వారా ఓ మెసేజ్‌ని అభిమానులకోసం పోస్ట్ చేసింది. మంగళవారం ఓ సర్‌ప్రైజ్‌ను ఇవ్వనున్నామని ట్వీట్‌లో పేర్కొంది. ‘అరవింద సమేత’ ఆడియో ఆల్బమ్ ఈనెల 20న డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తాం. రిలీజ్‌కి కొద్దిరోజుల ముందు ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తాం. మరో సర్‌ప్రైజ్ మీకోసం రేపు ఇవ్వనున్నాం’ అని ట్వీట్ చేసింది హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.