ద్విభాషా చిత్రం.. అంపశయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంపశయ్య నవీన్ తీర్చిదిద్దిన నవల తెరకెక్కుతోంది. శ్యామ్‌కుమార్, పావని ప్రధాన తారాగణంగా జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ పతాకాలపై సంయుక్తంగా ప్రభాకర్‌జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ రూపొందిస్తున్న చిత్రం ‘అంపశయ్య’. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ఒక తండ్రి పేదరికం మూలంగా కొడుకు యూనివర్సిటీలో చదవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రం అందరికీ నచ్చేలా సాగుతుందని తెలిపారు. ఒకే ఒక పాట గుండెలు పిండేలా ఉంటుందని, సమాజంలోని నమ్మకాలు, కులాల పట్టింపులు, పాతకాలపు చతుశ్శాల ఇళ్లు సినిమాలో కనిపిస్తాయని, 1965-70ల కాలంనాటి వాతావరణం ప్రతిబింబిస్తుందని తెలిపారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. మోనికాథాంప్సన్, యోగి దివాన్, శరత్, రాధాకృష్ణ, వాల్మీకి, స్వాతినాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్ నీర్ల, ఎడిటింగ్: సిందం గోపి, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.