యూ టర్న్ ఇచ్చారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘యూ టర్న్’- మిస్టరీ థ్రిల్లర్ జోన్‌గా వస్తున్న ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి సినిమా మంచి సక్సెస్ అయ్యింది. పవన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, భూమిక చావ్లా, హీరో రాహుల్ రవీంద్రన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్, వి.వై.కంబైన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారులు ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా విజయోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత, డైరెక్టర్ నందినిలు ముఖ్యఅతిథులుగా వచ్చారు. డైరెక్టర్ పవన్‌కుమార్ మాట్లాడుతూ.. సినిమా విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగు, తమిళ్లో వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లో మంచి హిట్‌అయ్యింది. ప్రేక్షకులకు ధన్యవాదాలు. సమంత సినిమాలో చాలా బాగా చేసింది. మ్యూజిక్‌కి మంచి మార్కులుపడ్డాయి అన్నారు.
ఎంపీ కవిత మాట్లాడుతూ... ఈ సినిమాకి పనిచేసిన అందరికీ మంచి విజయం దక్కింది. వండర్‌ఫుల్ సినిమా ఇది.. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలాబాగా ఉంది అంటున్నారు. సమంత ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా కనిపించింది. రంగస్థలంలో.. యూ టర్న్‌లో చాలా వేరియేషన్స్ చూపించింది. సమంత సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. డిఫరెంట్ స్టోరీస్ ఉన్న సినిమాలను ప్రతి ఒక్కరు ఆదరిస్తారు అనడానికి ఈ సినిమానే ఉదాహరణ. చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమాని అందరూ ఆదరించాలి అన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. సినిమాని ఇంత హిట్ చేసినందుకు అందరికీ థాంక్స్. మా సినిమాని సపోర్ట్‌చేసినందుకు మీడియాకి, రివ్యూయర్స్‌కి చాలా చాలా కృతజ్ఞతలు. నేను చేసిన సినిమాల్లో ఇంత పాజిటివ్ రివ్యూస్ రావడం, నా యాక్టింగ్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన కవిత గారికి, డైరెక్టర్ నందిని గారికి చాలా థాంక్స్. ఇంత మంచి సినిమా తీసిన ప్రొడ్యూసర్స్‌కి కృతజ్ఞతలు. వాళ్ళ ఫస్ట్ సినిమాగా ఇది చేసినందుకు గర్వంగా ఉంది. నా కెరీర్‌లో మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ పవన్‌కి చాలా థాంక్స్. ఈ సినిమాతో మూడు స్టేట్స్‌లో సక్సెస్‌కొట్టాడు. ఇది మొదలు మాత్రమే.. ఆయనలో ఇంకా చాలా టాలెంట్ ఉంది. ఈ చిత్రంలో నటించిన అందరికీ శుభాకాంక్షలు.