ఈ ఊపిరితో కొత్త ఉత్సాహం.. నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పివిపి సినిమాస్ బ్యానర్‌పై దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ, భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అనే్న నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఊపిరి’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడారు. ‘ఈ సినిమా చేసినందుకు చాలా గొప్పగా భావిస్తున్నా. ఇది ఫ్రెంచ్ సినిమా రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన నిజమైన కథ ఈ సినిమా. ఇప్పటికీ వారిద్దరూ బ్రతికే ఉన్నారు. కొన్ని కథలకు సోల్ ఉంటుంది. అటువంటి సినిమానే మా ఊపిరి. ఈ సినిమాతో మంచి అనుభవం కలిగింది. వంశీ తనను తాను రీఇనె్వంట్ చేసుకుని తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి సినిమాను చేశాడు. కార్తి కథలపట్ల చాలా పర్టిక్యులర్‌గా ఉంటాడు. తను ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్ళలో పది సినిమాలను మాత్రమే చేశాడు. తెలుగులో ఈ సినిమాతో తను స్ట్రెయిట్ సినిమా చేయడం కరెక్ట్ అని భావించాడు. సెట్స్‌లో కొన్ని సీన్స్‌లో తను నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోయేవాణ్ని. జయసుధ కూడా అదే విషయాన్ని చెప్పారు. నాకు కార్తిని చూసి సిగ్గేసేది. తెలుగు రాకపోయినా నేర్చుకొని చక్కగా డైలాగ్స్ చెప్తున్నాడు. నేను తమిళంలో ఎందుకు సరిగ్గా చెప్పలేకపోతున్నానని అనుకునేవాడిని. అలానే తమన్నా కథలో ఇన్‌వాల్వ్ అయి నటించింది. నా కెరీర్‌లో ఇదొక లైఫ్ ఛేంజింగ్ ఫిలిం అవుతుంది’ అని చెప్పారు. కార్తి మాట్లాడుతూ, మొదటిసారి తెలుగులో స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నానని, ఈ సినిమా ఒక డ్రీమ్‌లా జరిగిందని, నటుడు అనేవాడికి తృప్తినిచ్చే సినిమా ఇదని, సినిమాలతో డబ్బు వస్తుంది, బిజినెస్ అవుంతుందని అంటూంటారని, కానీ ఈ సినిమాతో గౌరవం వస్తుందని, ట్రెండ్ సెట్ చేసే సినిమా అని చెప్పారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఈ సినిమా చూసిన వెంటనే నాగార్జున, పివిపిగారు వచ్చి నన్ను హగ్ చేసుకున్నారని, వారి నమ్మకమే ఈ సినిమా అని, నాగార్జున లేకపోతే నేను అసలు ఈ సినిమా చేసేవాడ్ని కాదని చెప్పారు. పివిపి మాట్లాడుతూ, రెండు సంవత్సరాలుగా అందరం కలిసి కష్టపడి చేసిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న రిలీజ్ చేస్తున్నామన్నారు.
తమన్నా మాట్లాడుతూ, నాగార్జున, కార్తి లేకుండా ‘ఊపిరి’ సినిమాను ఊహించుకోలేమని, వారిద్దరు తమ పాత్రల్లో జీవించారని, సినిమాలో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ చేశామని, ఈ సినిమాలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉందని, ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా గర్వపడతారు అని చెప్పారు.