చాలా నేర్చుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చతెలుగు అమ్మాయిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చి భిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో వుంది యామినీ భాస్కర్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం ‘్భలే మంచి చౌకబేరమే’. నవీద్, నూకరాజు హీరోలుగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో ఆరోళ్ల గ్రూప్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ సమర్పణలో సతీష్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ యామినీ భాస్కర్‌తో ఇంటర్వ్యూ...

మంచి పాత్ర..
ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆదర్శి. ప్రక్కవాళ్లు ఇబ్బందుల్లో వుంటే వారికి సహాయం చేసే అమ్మాయిని. నాకుందా లేదా అనేది పక్కనబెట్టి అవతలివాళ్లకు సహాయం చేస్తుంటాను. అలా నా మంచితనాన్ని క్యాష్ చేసుకుని మోసం చేసే పాత్రలు నా చుట్టూ ఉంటాయి. వాటిమధ్య వచ్చే కామెడీతో ఈ సినిమా సాగుతుంది. ఈ పాత్ర నాకు చాలా దగ్గరగా వుంటుంది. అందుకే కనెక్ట్ అయిందనుకుంటా.
కన్ఫ్యూజన్ కామెడీ
ఇందులో నాన్ సింక్ కామెడీ, డార్క్ కామెడీ తరహాలో సినిమా సాగుతుంది. పాత్రలమధ్య వచ్చే కన్‌ఫ్యూజన్‌వల్ల ఎక్కువ కామెడీ వుంటుంది. చాలా కొత్త కానె్సప్ట్. తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా వుంటుంది. దర్శకుడు కూడా అద్భుతంగా తెరకెక్కించాడు.
మారుతి కానె్సప్టు
ప్రముఖ దర్శకుడు మారుతి ఇచ్చిన కానె్సప్టుతో తెరకెక్కిన సినిమా మారుతీ స్టైల్‌లోనే వుంటుంది. అలాగే ప్రముఖ నిర్మాత రాధా మోహన్‌కు నచ్చి ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది.
నర్తనశాలకంటే ముందే..
ఈ సినిమాను నర్తనశాలకంటే ముందే ఒప్పుకున్నాను. ఇది నా నాలుగో చిత్రం. నిజానికి నర్తనశాలలో మంచి పాత్ర చేశానని అంటున్నారు. అయితే సినిమా జయాపజయాలపైనే మన క్రేజ్ ఆధారపడి వుంటుంది. ఆ సినిమా విషయంలో ఆశించిన స్థాయి క్రేజ్ దక్కలేదు. కానీ ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. నన్ను హీరోయిన్‌గా నిలబెడుతుందని నమ్ముతున్నా.
చాలా నేర్చుకున్నా..
పరిశ్రమకు వచ్చి మూడేళ్లు అవుతుంది. ఇది నాలుగో చిత్రం. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎలా వుండాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలి లాంటి అంశాలు తెలుసుకున్నాను. సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆలోచించను. వందశాతం చేశామా లేదా అన్నది చూసుకుంటా.
తదుపరి చిత్రాలు
తెలుగులో మరో సినిమా చర్చల్లో ఉంది. ఓ తమిళ సినిమా విడుదలైంది.

-శ్రీనివాస్ ఆర్.రావ్