బాలీవుడ్‌లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపులు సినిమా హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తే, అర్జున్‌రెడ్డి చిత్రం రాత్రికి రాత్రే స్టార్‌గా నిలబెట్టింది. ఆ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత వచ్చిన గీతగోవిందం సక్సెస్‌తో ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుని వంద కోట్ల హీరోగా నిలబడ్డాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న నోటా చిత్రం తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. దాంతోపాటు ఆయన నటించిన టాక్సీవాలా త్వరలోనే విడుదల కానుంది. విజయ్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే మహానటి లాంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్నాదత్ నిర్మించే ఈ చిత్రానికి రాజ్-డి.కె. అనే దర్శక ద్వయం దర్శకత్వం వహిస్తారట. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మొత్తానికి అటు నోటాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ ఇటు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఖరారు కావడంతో ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా వున్నారు.