వచ్చేసింది.... వెంకటలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ భామ లక్ష్మీరాయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వేరీజ్ ది వెంకటలక్ష్మి’. రామ్‌కార్తీక్, పూజిత హీరో హీరోయిన్లుగా కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీ్ధర్‌రెడ్డి, హెచ్.అనంత్‌రెడ్డి, ఆర్.కె.రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేరీజ్ ది వెంకటలక్ష్మి’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక పాటను హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సమర్పకుడు గురునాధ్‌రెడ్డి మాట్లాడుతూ- రెండు నెలల క్రితం చిత్రీకరణ మొదలుపెట్టి అమలాపురంలో 20 రోజులు షూటింగ్ చేశాము. ప్రస్తుతం లక్ష్మీరాయ్‌పై ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నాం. ఆ తరువాత మరో పది రోజులపాటు అమలాపురంలో జరిగే షెడ్యూల్‌లో సినిమా పూర్తవుతుంది. లక్ష్మీరాయ్ టైటిల్‌రోల్ పోషిస్తున్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేస్తామన్నారు. లక్ష్మీరాయ్ మాట్లాడుతూ- పూర్తిస్థాయి కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. శేఖర్ మాస్టర్ నేతృత్వంలో పాటను చిత్రీకరిస్తున్నారు. హరి మంచి పాటలు ఇచ్చాడు. టీమ్ అంతా కష్టపడి పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- నిర్మాతల సహకారంతో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నాం. లక్ష్మీరాయ్ హైలెట్‌గా నిలుస్తుంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని పంచుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పంకజ్ కిషోర్, శేఖర్ మాస్టర్, మధునందన్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.