ఇదో యుద్ధ నేపథ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం కె.జి.ఎఫ్ (కోలార్ బంగారు గనులు). ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుపుకుంటోంది. ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసి నవంబర్ 16న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ- అమెరికాకు రష్యాకు మధ్య జరిగిన యుద్ధ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడంతో మనుషుల్లో అత్యాశ పెరిగింది. అదే సమయంలో భారతదేశంలో అతిపెద్ద బంగారు గని అయిన కెజిఎఫ్ ఒక మనిషి చేతిలోకి వెళితే ఏవౌతుంది అనే ఆసక్తికర అంశంతో ఈ చిత్రం ఉంటుంది. తమన్నా ప్రత్యేక పాటలో నర్తించింది. 70వ దశకంలో జరిగిన నేపథ్యంలో సినిమా ఉంటుంది అన్నారు.