తెరపైకి పురచ్చితలైవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్‌ల హవా ఓ రేంజ్‌లో నడుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే బయోపిక్ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ ట్రెండ్ ఇపుడు దక్షిణాదికి పాకింది. తాజాగా విడుదలైన కొన్ని బయోపిక్ చిత్రాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈ తరహా సినిమాలకు క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో అమ్మ జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తోంది దర్శకురాలు ప్రియదర్శిని. తాజాగా ప్రముఖ దర్శకుడు మురుగదాస్ పోస్టర్‌ను విడుదల చేశారు. ది ఐరన్ లేడీ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ జయలలిత పాత్రలో నటించనుంది. పేపర్ టేల్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక త్వరలోనే జరుపుతారట. మరోవైపు యువ నిర్మాత విష్ణు ఇందూరి కూడా జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తానని తెలిపాడు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించే ఈ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది.