మొఘల్.. అమీర్‌ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్ సినిమాల హవా ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే పలు బయోపిక్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్‌పై కూడా బాగానే ఉంది. ప్రముఖ హీరోలంతా బయోపిక్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో తాజాగా మరో క్రేజీ బయోపిక్ సినిమా తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి తెరకెక్కించే బయోపిక్ ఎవరిదో తెలుసా... క్యాసెట్‌కింగ్‌గా బాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న టిసిరీస్ అధినేత గుల్షన్‌కుమార్‌ది. టిసిరీస్ కంపెనీ బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో సంచలనం రేపింది. సాధారణ స్థాయినుండి అసాధారణ స్థాయికి ఎదిగిన గుల్షన్‌కుమార్ జీవితం నేటి యువతకు ఆదర్శం. అందుకే ఈ బయోపిక్ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత సుభాష్‌కపూర్. అయితే ఈ సినిమాలో హీరోగా నటించేది ఎవరో తెలుసా.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుగుతుంది. ఈ చిత్రానికి మొఘల్ అనే టైటిల్‌ని ఖరారుచేశారు. గుల్షన్‌కుమార్ తనయుడు భూషణ్‌కుమార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అవుతున్నాడు.