క్రైమ్/లీగల్

ఉసురు తీసిన విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 21: మండల కేంద్రమైన బాపులపాడు గ్రామంలోని రైల్వేకాలనీ సమీపంలో విద్యుత్‌షాక్‌కు గురై ఓ బాలుడు మృతి చెందాడు. హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ముడిచర్ల గ్రామానికి చెందిన అబ్బింది సురేష్ భార్య స్వాతి ప్రసవించేందుకు బాపులపాడు గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. కూతురు పుట్టడంతో కుమారుడైన పూర్ణ ధర్మతేజ (18నెలలు) తల్లితో పాటే అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నాడు. బుధవారం ఇంటి అవరణలో అడుకుంటున్న ధర్మతేజ ఫ్లస్‌బాక్స్‌లో పట్టుకున్నాడు. అదే సమయంలో బాక్స్‌లోకి కరెంట్ సరఫరా అయి షాక్‌కు గురైన తేజను పిన్నమనేని అసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స పొందుతున్న తేజ మృతి చెందడంతో జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి వరకు కళ్ళముందే అడుకుంటున్న కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.