25న నవాబ్ ప్రీరిలీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిరుచి కలిగిన తెలుగు నిర్మాతల్లో అశోక్ వల్లభనేనినీ ప్రస్తావించాలి. నానితో సెగ, గౌతమ్ మీనన్‌తో ఎర్ర గులాబీలులాంటి మంచి చిత్రాలను ప్రేక్షకుడికి అందించిన నిర్మాత అశోక్. తాజాగా తమిళంలో మణిరత్నం తెరకెక్కించిన ‘చెక్క చివంత వాణం’ చిత్రాన్ని ‘నవాబ్’ పేరిట తెలుగు ప్రేక్షకుడి ముందుకు తెస్తున్నారు. శింబు, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, అరుణ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, ఆదితిరావ్ హైదరి, జయసుధ, ప్రకాష్‌రాజ్.. భారీ తారాగణంతో వస్తోన్న చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం ‘నవాబ్’గా తెస్తున్నట్టు అశోక్ వెల్లడించారు. మరోసారి యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఫార్ములాపై నమ్మకంతో మణిరత్నం చేసిన తాజా ప్రయోగం ఇప్పటికే వదిలిన రెండు ట్రైలర్లతో అంచనాలను పెంచింది. మార్కెట్‌లో సెనే్సషన్ క్రియేట్ చేస్తున్న భారీ నిర్మాణ చిత్రం ప్రీరిలీజ్‌ను హైదరాబాద్‌లో 25న నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి మణిరత్నం, ఏఆర్ రెహమాన్ హాజరవుతున్నట్టు అశోక వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.