5న దేవరకొండ నోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోటా డేట్ కన్‌ఫర్మ్ అయింది. అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలకానుంది. విజయ్ దేవరకొండ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాన్ని ఆనంద్‌శంకర్ తెరకెక్కిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న నోటాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండకు ఇది తొలి ద్విభాషా చిత్రం. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. తమిళ వర్షన్‌లోనూ విజయ్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. మెహ్రీన్‌కౌర్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. శాంతన కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందించారు.