వేసవికి పెన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.వి.ప్రకాష్, శ్రీదివ్య జంటగా హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై మణినాగరాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందిస్తున్న చిత్రం ‘పెన్సిల్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ గౌతమ్‌మీనన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ, కాలేజి నేపథ్యంలో జరిగే ఈ కథనం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ థ్రిల్లింగ్‌గా ఉంటుందని, ఈ వేసవికి విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. జపాన్‌లో కొంత భాగాన్ని షూట్ చేశామని, టోటల్‌గా సినిమా పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. వేసవి కానుకగా ఏప్రిల్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. షరీక్‌హసన్, వి.టి.వి. గణేష్, ఊర్వశి, టి.పి.గజేంద్రన్, అభిషేక్ శంకర్, ప్రియాఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, కెమెరా: గోపీ అమర్‌నాథ్, ఎడిటింగ్: ఆంటోనీ, మాటలు: శశాంక్ వనె్నలకంటి, పాటలు: శ్రీమణి, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: మణి నాగరాజ్.