స్క్రీన్‌కు కోహ్లీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహ్లీ. వరల్డ్ క్రికెట్‌లో ఆ పేరే ఓ సెనే్సషన్. భారత జట్టులో తనదైన శైలి బ్యాటింగ్ స్టైల్‌తో కొన్ని కోట్లమందిని అభిమానులుగా మలుచుకున్న హీరో. కోహ్లీ క్రీజులో ఉంటే టీమిండియాదే గెలుపన్న భరోసా ప్రతి ఒక్క భారతీయుడికి. క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన కొనే్నళ్లలోనే రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు వెండి తెర రికార్డుల మీద కనే్నశాడన్న సందేహం వస్తుంది. ఎందుకంటే రియల్ హీరో స్క్రీన్ హీరోగా వస్తున్నాడా అన్న సందిగ్ధంలో పడేశాడు ఈ రన్ మెషీన్. తాను తన ట్విట్టర్ ద్వారా మళ్ళీ నా మొదటి సినిమా అన్నట్టుగా ఒక పోస్టర్ని విడుదలచేసాడు. ఆ పోస్టర్ చూడ్డానికి మాటల్లో నుంచి దూసుకువస్తున్న బాణంలా కోహ్లీ దూసుకొస్తున్నాడు. అది సినిమానా...? లేక ట్రైలరా...? అన్న డైలమాలో పడేసాడు కోహ్లీ. ఆ చిత్రానికి ‘ట్రైలర్ ది మూవీ’ అని పేరుపెట్టారు. నిర్మాణ సంస్థ ఏమో ‘ది రాంగ్ ప్రొడక్షన్స్’ అని పెట్టారు. కొత్త హీరోలను వెండి తెరకు పరిచయంచేసే విధంగా విరాట్ కోహ్లీని మీకు పరిచయం చేస్తున్నామంటూ. అది అసలు ట్రైలరా? లేక నిజంగానా కోహ్లీ హీరోగా మారుతున్నాడా? అన్న సందేహం రాకమానదు. ఈనెల 28న విడుదల చేస్తున్నాం అన్నట్టుగా తేదీనీ పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ వెనుక ఆంతర్యమేంటో తెలియాలంటే 28 వరకు ఆగాల్సిందే.