ప్రాణప్రదమైన పాత్రలే చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీత గోవిందం సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది కన్నడ నటి రష్మిక మండన్న. చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటిస్తానంటోంది. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాస్‌లోనూ ప్రాధాన్యత కలిగిన పాత్ర చేస్తోన్న రష్మిక, ఇక్కడే మరో రెండు ప్రాజెక్టులకూ ఓకె చెప్పేసింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినిదత్ నిర్మిస్తున్న దేవదాసు ఈనెల 31న విడుదల కానున్న సందర్భంలో మీడియాతో రష్మిక ముచ్చట్లు.
పక్కింటి అమ్మాయిలా..
దేవదాసులో పక్కింటి అమ్మాయ తరహా పాత్ర. పేరు పూజ నానికి పెయిర్. నాని అంటే ఇష్టంతో ప్రతిరోజూ అతని క్లినిక్‌కి వస్తుంటాను. అతన్ని చూసేందుకు రోజుకో సమస్యతో వచ్చే చిత్రమైన పాత్ర. కొత్తగా అనిపించింది. ఈ ప్రాజెక్టు కోసం గీతగోవిందం కంటే ముందే అడిగారు. అసలే పెద్ద బ్యానర్.. అందులోనూ మంచి రోల్. దర్శకుడు పాత్ర గురించి వివరించగానే ఓకే చెప్పేసాను.
నాగ్.. నానీలతో..
నాగార్జున, నానిలతో కలిసి నటించడం గొప్ప అనుభూతి. నాగ్ సీనియర్ అయనా సెట్స్‌లో వెరీ కూల్. ఇక నాని గురించి చెప్పదేముంది, మంచి వ్యక్తి. నాగ్, నాని కలిశారంటే.. సెట్స్‌లో ఒకటే గోల. నిజంగా షూటింగ్‌ని ఎంజాయ్ చేశా.
నటనకు స్కోప్ ఉంటేనే..
గీత గోవిందం సినిమా తరువాత నా ఆలోచన మారింది. మంచి పాత్రలు వస్తేనే చేయాలనీ ఉంది. ముఖ్యంగా నటిగా నన్నునేను ప్రూవ్ చేసుకోవాలి. ఇక గ్లామర్ అంటారా.. హద్దులు దాటకుంటే ఓకే. ఈ విషయంలో నా నిర్ణయం మారదు.
అది ఊహించలేదు..
గీత గోవిందం ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదు. మనం ఏ సినిమా చేస్తున్నా సక్సెస్ కావాలనే కోరుకుంటాం. కానీ ఏకంగా బ్లాక్‌బస్టర్ అవ్వడం హ్యాప్పీగా ఉంది. నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. చాలామంది ఫోన్‌లో ప్రశంసిస్తున్నారు. నటిగా ఇంతకంటే ఏం కావాలి.
పర్సనల్స్ అడగవద్దు.. ప్లీజ్
సినిమాలంటే ఇష్టం కనుక హీరోయిన్ అయ్యాను. అంతమాత్రాన నా పర్సనల్ విషయాలు అందరికీ చెప్పుకోవాలని లేదు. ఒకవేళ నాతో డైరెక్ట్‌గా ప్రేక్షకులు మాట్లాడాలంటే సోషల్ మీడియా ఉంది. నేనెప్పుడూ యాక్టీవ్‌గానే ఉంటా.. దయచేసి పర్సనల్స్ అడగొద్దు, ప్లీజ్.
తదుపరి చిత్రాలు..
ప్రస్తుతం తెలుగులో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయ. అందులో ఒకటి నితిన్‌తో చేయబోయే ప్రాజెక్టు. వివరాలు నిర్మాతలు ప్రకటిస్తారు. అలాగే తమిళంలోనూ ఓ సినిమా ఉంటుంది. కన్నడంలో రెండు సినిమాలు చేస్తున్నా.

- శ్రీ