పెళ్లింట ప్రేమకథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లంటే -నూరేళ్ల పంట. ఇద్దరి మధ్యా అన్నీ నిజాలే ఉండాలి. అరమరికలు, అబద్ధాలు ఉండకూడదన్నది నేటి యుతవ థియరీ. ఈ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రం -శుభలేఖ+లు. శరత్ నర్వాడేను దర్శకుడిగా పరిచయం చేస్తూ హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి విద్యాసాగర్, జనార్ధన్ ఆర్‌ఆర్ నిర్మిస్తోన్న చిత్రమిది. శ్రీనివాస సాయి, దీక్ష శర్మ రైనా హీరో హీరోయిన్లు. లీడ్ క్యారెక్టర్‌లో ప్రియా వడ్లమాని కనిపించనున్న చిత్రంలో వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రధారులు. శ్రీమతి సి సుధాసాగర్ సమర్పిస్తోన్న సినిమా తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంలో నిర్మాతలు సి విద్యాసాగర్, జనార్ధన్ ఆర్‌ఆర్ మాట్లాడుతూ ‘ఉదాత్త ఆలోచనలతో నిర్మించిన సినిమాకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. తొలి కాపీ సిద్ధమైంది. సినిమాలో ఆరు పాటలు ఆణిముత్యాలే. కెఎం రాధాకృష్ణన్ సినిమాకు అంగీకరించారంటే, అందులో సంగీతానికి ప్రాధాన్యమున్నట్టే. ఆనంద్, చందమామ చిత్రాల జాబితాలో ఈ సినిమా నిలుస్తుందన్న నమ్మకముంది. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ‘వేద వాహిని’ పాట చిత్రానికి హైలెట్. జాతీయ, రాష్ట్ర అవార్డుల చిత్రాలకు పని చేసిన కెమెరామెన్ యన్ మురళీమోహన్‌రెడ్డి ఈ చిత్రానికీ ప్రతిభావంతమైన కెమెరా వర్క్ అందించారు. ప్రతి ఫ్రేమ్ ఐ ఫీస్ట్‌తో, బాలీవుడ్ స్టైల్ మేకింగ్‌ను తలపించటం ఖాయం. కొత్త ఆర్టిస్టులతో నేచురల్‌గా డిజైన్ చేసిన చిత్రమిది. వీళ్లని చూస్తే హైదరాబాద్‌లో ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారా? అనిపిస్తుంది. ఓ పెళ్లింట్లో సాగిన రెండు ప్రేమ కథల నేపథ్యమే సినిమా. జంధ్యాల సినిమాను మాధుర్ భండార్కర్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో? అలా ఉంటుంది మా సినిమా అన్నారు.