నచ్చేశావే శైలజ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుపమ ఆర్ట్స్ పతాకంపై నాగేశ్వరరావు దర్శకత్వంలో వి రామకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం -నువ్వెందుకు నచ్చావే శైలజ. రోషన్, అనూష జంటగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ మొదలైంది. ముహూర్తపు షాట్‌కు సి కళ్యాణ్ క్లాప్‌నివ్వగా, కొమర వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్రం ప్రారంభం సందర్భంగా దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ -ఇదో యాంటీ లవ్ స్టోరీ. ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించకూడదు? ఈ కానె్సప్ట్‌తో తెరకెక్కుతోంది. ప్రేమించడానికి కొన్ని అర్హతలుండాలి అన్న విషయాన్ని నమ్ముతూ, అవేంటో స్క్రీన్‌పై చూపించ దలిచాం. యూత్‌కు కావాల్సిన అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. నేటినుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. నాలుగు పాత్రల మధ్య సాగే ఆసక్తికరమైన కథనమే ఈ సినిమా. కథ నచ్చడంతో సినిమా నిర్మాణానికి రామకృష్ణ ముందుకొచ్చారని వివరించారు. నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ కథమీద మమకారంతో చేస్తున్న సినిమా ఇది. మంచి టీమ్ దొరికింది. పాపులర్ ఆర్టిస్ట్‌లంతా చిత్రంలో చేస్తున్నారన్నారు. కానె్సప్ట్ ఓరియెంటెడ్ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉందని కెమెరామెన్ యం జోషి అన్నారు. చిత్రానికి ఎడిటర్ నందమూరి హరి, సంగీతం సాయికార్తీక్.