కిస్సింగ్‌కు కైరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా హిందీలో షాహిద్‌కపూర్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం. కైరా అద్వానీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమై ఇటీవలే తెలుగులోకి మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత ప్రస్తుతం రామ్‌చరణ్ సరసన నటిస్తున్న ఈమెకు తెలుగులో పలు చిత్రాలు క్యూలో వున్నాయి. తాజాగా అర్జున్‌రెడ్డి లాంటి సంచలన చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం అడిగారట. పాత్ర నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించిందట. ఈ పాత్ర చేస్తే తనకు మరింత గుర్తింపు వస్తుందని భావించిన కైరా ఓకె చెప్పిందని టాక్. చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.