ఆశ ఎక్కువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ మరోవైపు హాట్ హాట్ ఫొటో షూట్‌లతో క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ పరిణీతి చోప్రా త్వరలో దక్షిణాది భాషల్లోకి ఎంటర్ అవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో పరిణీతిని హీరోయిన్‌గా అడిగారు. ఈ సినిమా చేయడానికి ఈ భామ రెమ్యూనరేషన్ బాగానే డిమాండ్ చేసిందట. బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేకపోయినా ఇలా సౌత్ సినిమా కోసం ఇంతగా డిమాండ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా నటించడానికి టాప్ హీరోయిన్లు సైతం ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అలాంటిది ఈ భామ ఇలా బెట్టుచేయడం దేనికనేది అర్థంకాకుండా వుంది. అయితే, ఈ సినిమాకోసం ఆమె డిమాండ్ చేసినంత ఇవ్వడానికి దర్శకుడు మురగదాస్ సుముఖంగానే ఉన్నాడట. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు మురగదాస్. పరిణీతి అయితే హిందీ మార్కెట్‌కు బావుంటుందని ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఏదేమైనా ఇలా డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఆమెకే తెలియాలి.