పాతికేళ్ల కుర్రాడినే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవదాస్ అంటే -ఓ అక్కినేని. దేవదాస్ అంటే -ఓ విషాదం. దేవదాస్ అంటే -్భగ్న ప్రేమ. దేవదాస్ అంటే -మనదికాని మనదైన తెలుగు కథ. ఇదీ క్లుప్తంగా -దేవదాస్ అన్న నాలుగక్షరాలు వినిపిస్తే కలిగే భావన. నిజానికి అదో మాస్టర్ పీస్. తాజాగా మరో దేవ-దాస్‌లు వస్తున్నారు. వీళ్లు నవ్విస్తారు. కవ్విస్తారు. గుండె చెదిరే విషాదం నుంచి ఒకింత ఉపశమనం కలిగిస్తారు. వాళ్లే -నాని, నాగార్జున. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, వెటరన్‌గానూ ఉత్సాహం చూపుతున్నాడు. ఫ్రెష్ హీరోలకు పోటీ నిస్తున్నాడు. నాగ్ చరిష్మా కుర్ర హీరోలకు జెలసీ పుట్టిస్తోందంటే -ఇమేజ్‌ను అంచనా వేసుకోవచ్చు. ‘పాత దేవదాస్‌కు మా దేవదాస్‌కు మధ్య ఒక్క మందు బాటిలే పోలిక. ఇది తప్ప ఏ పోలికా లేదు. మేం నవ్వుల దేవదాసులం’ అన్నది నాగ్ చెప్తోన్న మాట. నాని కాంబినేషన్‌లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన దేవదాస్ శుక్రవారం విడుదలవుతుంది. చిత్రం గురించి నాగ్ చెప్పిన ముచ్చట్లు..

మళ్లీ డాన్‌గా కనిపిస్తున్నారు?
-ఔను, చాలకాలమైంది. మళ్లీ డాన్ అవతారమెత్తా. కానీ, ఈ డాన్ వేరు. వాడి వ్యవహారం వేరు. నాకు, నానికిమధ్య వున్న ఫ్రెండ్‌షిప్, మేమిద్దరం ఎలా కలుసుకున్నాం, తరువాత ఏం జరిగింది? అనే అంశాలతో ఉంటుంది. తను డాక్టర్. నేను పేషెంట్.
మీరు పేషెంట్ ఎలా?
- నేను పేషెంట్‌నే. అలాగే వెళ్లి డాక్టర్ నానిని కలుస్తా. ఈ సినిమాలో నాకు ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. నానిని కలిశాక తను నాకు మంచి ఫ్రెండ్ అవుతాడు. ఇద్దరం కలిసి చేసే అల్లరి ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. మున్నాభాయ్ తరహా సినిమా ఇది.
నానితో పనిచేయడం?
-నాని నైస్ పర్సన్. తనతో ఇంతకుముందు పెద్దగా పరిచయం లేదు. సినిమాలో ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం. అద్భుతంగా నటిస్తాడు, అతనిలో ఏదో మాజిక్ ఉంది.
మీకు హీరోయిన్?
-ఉంది. ఆకాంక్ష. యంగ్ ఏజ్ నుంచి ఆ అమ్మాయికి నేను ఫ్యాన్. తను న్యూస్ రీడర్. ఆమె దగ్గరికి రాగానే నా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. తనతో నా ప్రేమను వ్యక్తం చేయలేను. కానీ మా ఇద్దరినీ నాని కలుపుతాడు.
మల్టీస్టారర్లపైనే దృష్టిపెట్టారెందుకు?
-అలా ఏమీ లేదు. ఇప్పటికే పరిశ్రమలో 32ఏళ్లుగా ఉన్నా. భిన్నమైన పాత్రలు చేయాలనుంది. ఈ వయసులో సోలో కథలు చేయడం కష్టం. ఎందుకంటే అలాంటి కథలు రావు. ప్రేమకథలు, ఉద్యోగం లేదనే కథలు, తండ్రి పాత్రలు.. ఈ వయసులో చేయలేం కదా. అందుకే ఇలా భిన్నంగా ప్రయత్నిస్తున్నా.
మల్టీస్టారర్లు సేఫ్ అనా?
-మల్టీస్టారర్లు సేఫ్ అని ఎవ్వరూ చెప్పరు. ఇక్కడ కేవలం ఇద్దరు హీరోల మాజిక్ వర్కవుట్ అవుతుందన్న ఆలోచన. అంతే తప్ప పక్కా హిట్ అవుతాయని చెప్పలేం. దీంట్లో రిస్క్ కూడా ఉంటుంది. పొరబాటున సినిమా తనే్నస్తే.. ఇద్దరు హీరోలు ఉండీ హిట్ చేయలేకపోయారన్న అపవాదు తప్పదు.
దర్శకుడి గురించి?
-ఈ కథని రెండేళ్ల క్రితం శ్రీ్ధర్ రాఘవన్ అనే రచయిత చెప్పాడు. కథ నచ్చింది. తరువాత అది వైజయంతి బ్యానర్‌కు వెళ్లడం, వాళ్లే దర్శకుడిని ఎంపిక చేసి నాకు చెప్పారు. రెండో పాత్ర కోసం ఎవరు చేస్తారన్న ఆలోచనలో ఉన్నపుడు నాని చేస్తాడని చెప్పగానే బావుంటుందని అనుకున్నాం. దర్శకుడు శ్రీరాం ఆదిత్య చక్కగా డీల్ చేశాడు. తను చేసిన శమంతకమణి సినిమా చూశా. బాగా నచ్చింది.
మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం?
-కథ పూర్తి ఎంటర్‌టైనర్‌గా వెళ్తూ, ఎక్కడో చిన్న మెసేజ్ అనే టచ్‌తో ఉంటుంది. హిందీలో రాజు హీరాణి సినిమా తరహాలో, దేవ్‌ది ఫుల్ ఎనర్జీ పాత్ర. దాస్‌ది సమస్యలున్న పాత్ర. వీరిద్దరి కాంబినేషన్ నవ్విస్తుంది.
సాధారణంగా మల్టీస్టారర్ అంటే ఇద్దరూ ఒకే ఏజ్ గ్రూప్ వున్న హీరోలతో చేస్తారు కదా? మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా?
-ఇపుడు నేను నానితో చేస్తున్నది సేప్ ఏజ్ గ్రూప్ కాదా (నవ్వుతూ)? సేమ్ వయసున్న వాళ్లతో చేస్తే బోర్. ఆటోమేటిగ్గా ఇది ముసలివాళ్ల సినిమా అంటారు. అలా అనిపించుకోవడం అవసరమా?.
కానె్సప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తారా?
-అంటే మీ ఉద్దేశ్యం? ఇద్దరు పిల్లల తండ్రి పాత్రలనేగా? నాకు పిల్లలు లేరండి బాబూ. ఇపుడున్న పిల్లలు నా బ్రదర్స్. నేనిప్పుడు తండ్రి పాత్రలు చేయలేను. మానసికంగా నా వయస్సు ఎప్పుడూ 25. అలాగే ఆలోచిస్తా. అమల కూడా నువ్వింకా పాతికేళ్ల కుర్రాడివే అనుకుంటున్నావా అంటుంటుంది.
మీ గ్లామర్ రహస్యం?
-ప్రత్యేకంగా రహస్యమంటూ ఏమీ లేదు. నా వయస్సు ఇప్పుడు 59. గత 30 ఏళ్లుగా రోజూ ఉదయానే్న వ్యాయామం చేస్తా. ఒక్కసారి రీఛార్జ్ అయ్యానంటే ఆ రోజంతా యాక్టివ్. నా ఫ్రెండ్స్ కూడా రోజురోజుకూ నీ వయస్సు తగ్గిపోతోంది, యంగ్ జనరేషన్‌తో ఫ్రెండ్‌షిప్ చెయ్యి అని సలహాలిస్తుంటారు.
వైజయంతి బ్యానర్‌లో..?
-ఆఖరిపోరాటం సినిమాతో మా బంధం మొదలైంది. దత్తుగారు, రాఘవేంద్రరావు చేసిన ఆ సినిమా కోసం అప్పట్లోనే హిందీలో స్టార్ హీరోయిన్ రేంజ్‌లోవున్న శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకొచ్చాడు. అప్పటికి నేను పెద్ద హీరోను కాను, ఎలాంటి ఇమేజూ లేదు. కానీ శ్రీదేవి నా పక్కన నటిస్తే నా రేంజ్ కూడా పెరుగుతుందని భావించి శ్రీదేవిని పెట్టారు. ఆయనకు సినిమా అంటే పాషన్. ఈమధ్యే మహానటిలాంటి క్లాసిక్ సినిమా తీశారు. ఈ బ్యానర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇందులో నాకు ఇది ఐదో చిత్రం.
నాని గురించి ఏదో సీక్రెట్ చెబుతానన్నారు?
-నాని ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటాడు. తను రాత్రుళ్లు కూడా ఫోన్ పట్టుకునే ఉంటాడనుకుంటా. అది అతనికి డిసీజ్‌గా మారింది. నాని కాకుండా వేరే వాళ్లయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చేవాడిని. తను కూడా ఫోన్ వ్యసనంలా మారిందని చెప్పుకొచ్చాడు. నిజమే.. ఈమధ్య చాలామందికి ఫోన్లు వ్యసనంలా మారి పక్కనేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో వున్నారు.
తదుపరి చిత్రాలు?
-బంగార్రాజు సినిమాకోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దాంతోపాటు రాహుల్ దర్శకత్వంలో మరో స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయి. అలాగే ధనుష్‌తో కలిసి తమిళ తెలుగు భాషల్లో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. అలాగే బాలీవుడ్‌లో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది.
బయోపిక్‌ల గురించి ఎవరూ అడగలేదా?
-ఈమధ్యే ఒకరు అడిగారు. అదీ నాన్నగారిది కాదు. రాజ్యాంగం రాసిన సమయంలో అంబేద్కర్‌కు సలహాదారుడిగా వున్న వ్యక్తి కథ. అయితే అది సినిమాగా కాదు. వెబ్ సిరీస్ కోసం అడిగారు.

-శ్రీనివాస్ ఆర్.రావ్