ఈ నాటకం ఓ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశిష్ గాంధిని హీరోగా పరిచయం చేస్తూ కళ్యాణ జి గోగన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నాటకం. అషిమా నేర్వాల్ హీరోయిన్. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో శ్రీ సాయిదీప్ చట్లా, రాధికా శ్రీనివాస్, ప్రవీణ్ గాంధి, ఉమా కూచిపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 28న విడుదల అవుతున్న సందర్భంగా హీరోగా పరిచయం అవుతున్న ఆశిష్ గాంధి చెప్పిన విశేషాలు... హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. ఎంబిఏ మానేసి సినిమాల కోసం ప్రయత్నం చేసేవాడిని. సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లోవాళ్లు సినిమాలు వద్దు, మంచి జాబ్‌లో సెటిల్ అవ్వమని చెప్పేవారు. కానీ నా ఆలోచన మారలేదు. నేను ఇదివరకే విలన్‌గా రెండు మూడు సినిమాల్లో నటించా. దర్శకుడు కళ్యాణ్ నాకు చాలా రోజులుగా పరిచయం వుంది. తాను దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ కథను చెప్పాడు. ఈ సినిమా కోసమే నా ఈ గెటప్. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు నాటకం అన్న టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. హీరోయిన్ అషిమా చక్కగా నటించింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగిన ఓ రివెంజ్ డ్రామా. అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సాగుతుంది. ఈ సినిమాకు మా అన్నయ్యే నిర్మాత. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పిఎస్‌వి గరుడవేగ ఫేమ్ అంజి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. తప్పకుండా ఈ నాటకం నన్ను హీరోగా నిలబెడుతుందని నమ్ముతున్నాను అన్నారు.